Webdunia - Bharat's app for daily news and videos

Install App

గృహరుణాన్ని తొందరగా తీర్చేయాలనుకుంటున్నారా?

Webdunia
మంగళవారం, 9 ఆగస్టు 2022 (18:41 IST)
గృహరుణాన్ని తొందరగా తీర్చేయాలని చాలామంది ఆలోచిస్తున్నారు. అయితే కొత్తగా రుణం తీసుకున్న వారు దీర్ఘకాలంపాటు ఈ అప్పు భారాన్ని మోయాల్సి ఉంటుంది. అయితే కొన్ని అంశాలపై దృష్టి పెడితే వారికి రుణభారం తగ్గే అవకాశం వుంది. 
 
రుణాల విషయంలో వడ్డీ రేట్లు ద్రవ్యోల్బణానికి అనుగుణంగా కదులుతూ ఉంటాయి. గృహరుణం 15, 20 ఏళ్ల దీర్ఘకాలిక అప్పు. ఈ వ్యవధిలో ఎన్నోసార్లు వడ్డీ రేట్లు తగ్గడం పెరగడం చూస్తుంటాం. కాబట్టి, ఈ విషయాన్ని ప్రతికూల దృష్టితో చూడొద్దు. వడ్డీ రేటు పెరిగినా.. ఈఎంఐపై దాని ప్రభావం ఉండదు. కాబట్టి, మీ నెలవారీ బడ్జెట్‌పై ప్రభావం ఉండదు. కేవలం వ్యవధి మాత్రమే పెరుగుతుంది. మళ్లీ వడ్డీ రేట్లు తగ్గినప్పుడు.. వ్యవధీ సర్దుబాటవుతుంది.
 
రుణానికి చెల్లించే ఈఎంఐలు ఎప్పుడూ సకాలంలో చెల్లించేయండి. లేకపోతే ఆలస్యపు రుసుములు వసూలు చేస్తాయి బ్యాంకులు. దీనివల్ల అనవసర భారం పడుతుంది. క్రెడిట్‌ స్కోరు దెబ్బతినడం వల్ల కొత్త అప్పు తీసుకోవాలనుకున్నప్పుడు వడ్డీ రేటు మనకు అనుకూలంగా ఉండదు. మూడు నెలలకు సరిపడా ఈఎంఐ ఎప్పుడూ సేవింగ్‌ బ్యాంకు ఖాతాలో ఉండేలా జాగ్రత్త తీసుకోండి.
 
అధిక వడ్డీ వసూలు చేసే బ్యాంకు నుంచి తక్కువ వడ్డీకి రుణం ఇచ్చే సంస్థకు మారేందుకు ప్రయత్నించవచ్చు. వ్యవధి పెరగకుండా చూసుకునేందుకు ఉన్న మార్గం.. వీలైనప్పుడల్లా అసలును చెల్లిస్తూ వెళ్లడం. ఏడాదికోసారి అదనంగా ఒక ఈఎంఐని చెల్లించే ప్రయత్నం చేయొచ్చు. 
 
బోనస్‌లు, లేదా అనుకోకుండా వచ్చిన డబ్బును రుణం చెల్లించేందుకు వినియోగించుకోవచ్చు. ఏడాదికి అసలులో కనీసం 5 శాతం చెల్లించినా ఎంతో వడ్డీని ఆదా చేసుకున్నట్లు అవుతుంది. తొందరగా అప్పు నుంచి బయటపడొచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Vamsi: సినిమా బాగుంటే చూస్తారు, రివ్యూర్ల రాతలు వల్లకాదు : నాగవంశీ ఫైర్

28°C టెంపరేచర్ జానర్‌లో మూవీ సాగదు: నిర్మాత సాయి అభిషేక్

ప్రియదర్శి, పరపతి పెంచే చిత్రం సారంగ పాణి జాతకం: కృష్ణప్రసాద్

రామ్ చరణ్ 'పెద్ది' ఆడియో రైట్స్‌కు కళ్లు చెదిరిపోయే ధర!

ఈ సంక్రాంతికి రఫ్ఫాడించేద్దామంటున్న మెగాస్టార్! (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

తర్వాతి కథనం
Show comments