Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశవ్యాప్తంగా ఆస్పిరో ఫాసెట్‌ రేంజ్‌ని లాంచ్‌ చేసిన హింద్‌వేర్‌

Webdunia
సోమవారం, 10 జనవరి 2022 (20:30 IST)
భారతదేశంలో బాత్రూమ్‌ సొల్యూషన్స్‌లో అగ్రగామిగా ఉంటూ... ఎప్పటికప్పుడు సరికొత్త ఆవిష్కరణలతో దూసుకుపోతోంది హింద్‌వేర్‌ సంస్థ. ఇప్పటికే ఎన్నో ఉత్పత్తులకు లాంచ్‌ చేసి వినియోగదారుల ఆదరాభిమానాలను చూరగొన్న హింద్‌వేర్‌. ఇప్పుడు తాజాగా ఆస్పిరో సిరీస్‌ను మొదలుపెట్టింది. ఈ లాంచ్‌ కార్యక్రమం అంగరంగ వైభవంగా ఒకేసారి ఆఫ్‌లైన్‌ మరియు ఆన్‌లైన్‌లో నిర్వహించారు.


ఈ కార్యక్రమంలో ఒకేసారి వేలాది మంది డీలర్లు పాల్గొన్నారు. భారతదేశంలో 8 ప్రాంతాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా డీలర్లు కాకుండా ఇతరులు కూడా పాల్గొని లాంచ్‌ను విజయవంతం చేశారు. ఇప్పుడు వస్తోన్న కొత్త ఆస్పిరో సిరీస్... అందరికి అందుబాటులో ధరలో, ప్రీమియం డిజైన్‌తో కూడిన అనేక రకాల ట్యాప్‌లు ఉన్నాయి. 'ఆస్పిరో' సిరీస్ అనేది వంటగది మరియు బాత్‌రూమ్‌ల కోసం కుళాయిలు, మిక్సర్లు మరియు డైవర్టర్‌లను కలిగి ఉన్నాయి. అన్నింటికి మించి వీటిని అత్యధిక నాణ్యత గల మెటీరియల్‌తో రూపొందించారు.

 
హింద్‌వేర్‌ యొక్క కొత్త ఆస్పిరో సిరీస్‌ కలెక్షన్ ఇంట్లో బాత్‌రూమ్‌ వాతావరణానికి చక్కగా సరిపోతాయి. అంతేకాకుండా ఆతిథ్యరంగం మరియు వాణిజ్య సెట్టింగ్‌లకు అత్యంత తక్కువ ధరకు చూడచక్కని అందాన్ని అందిస్తుంది. అన్నింటికి మించి ప్రీమియం మెటీరియల్స్ మరియు అధిక-నాణ్యతతో రూపొందిన ఆస్పిరో సిరీస్‌... రాబోయే సంవత్సరాల్లో యజమానులకు ఆందోళన-రహిత పనితీరును అందిస్తుంది.

 
హింద్‌వేర్ ఆస్పిరో సిరీస్ విస్తృత గృహ అవసరాలు మరియు బడ్జెట్‌లకు సరిపోయే వాణిజ్య మరియు గృహ అనువర్తనాలను అందిస్తుంది. ఇవన్నీ బాత్రూమ్ మరియు వంటగది ఉత్పత్తుల కోసం అంతులేని డిజైన్‌లతో రూపొందించబడ్డాయి. వీటిని కొత్తగా ఏర్పాటు చేయడం ద్వారా ఒక ప్రాంతం దాని సొంత సొంత వ్యక్తిత్వాన్ని అందిస్తుంది.

 
బ్రాండ్‌ మరియు మంచి డిజైన్‌ ఉన్న వస్తువులు అన్నీ ఎక్కువ ధరతో ఉంటాయి అనే అభిప్రాయం చాలామందికి ఉంటుంది. ఇప్పుడా అభిప్రాయాన్ని ఆస్పిరో సిరీస్‌ మార్చబోతోంది. సరసమైన ధరల్లోనే ఆస్పిరో సిరీస్‌ వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. అన్నింటికి మించి అసంఘటిత రంగంలో ఈ బ్రాండ్‌ ఇప్పుడు ఉన్న వాటికి మంచి పోటీ ఇవ్వబోతోంది.

 
ఈ సందర్భంగా ప్రోడక్ట్ సిరీస్ గురించి, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, బాత్‌ బిజినెస్‌, బ్రిలోకా శ్రీ సుధాన్షు పోఖ్రియాల్ మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ, “హింద్‌వేర్‌లో కేవలం ఉత్పత్తులు మాత్రమే కాదు అంతకంటే ఎక్కువ అందించడం ద్వారా కొత్త ట్రెండ్‌లను సెట్ చేయడం మరియు జీవితాలను మెరుగుపరచాలని మేము భావిస్తున్నాము. అందుకే ఇప్పుడు మా ఈ కొత్త సిరీస్‌ లాంచ్‌ చేస్తున్నాము. ప్రీమియం ట్యాప్‌లు, మిక్సర్లు మరియు వాష్‌బేసిన్‌ల యొక్క సరికొత్త 'ఆస్పిరో' శ్రేణిని పరిచయం చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ప్రీమియం కేటగిరీ వస్తువులు చాలా నాణ్యతగా ఉంటాయి. అవి మన అందుబాటు బడ్జెట్‌లో లభిస్తే ఇంకా ఆనందంగా ఉంటుంది. అలాంటప్పుడు మన వంటగది లేదా బాత్రూమ్ మనం పెట్టిన డబ్బు మనకు ఆనందాన్ని ఇస్తుంది. ఈ లాంచ్‌తో, ప్రీమియం హింద్‌వేర్‌ ఉత్పత్తుల్ని తక్కువ బడ్జెట్‌తో కొనుక్కోవాలని అనుకునే వినియోగదారులే ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం అని అన్నారు ఆయన.

 
ఆస్పిరో సిరీస్‌ లాంచ్‌ ఈవెంట్‌ భారతదేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, జలంధర్, లక్నో, కోల్‌కతా, పూణె, అహ్మదాబాద్, హైదరాబాద్ మరియు బెంగళూరు వంటి ఎనిమిది ప్రధాన నగరాల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రతి ప్రాంతం నుండి పంపిణీదారులు మరియు ప్రధాన డీలర్లు హాజరయ్యారు మరియు వర్చువల్‌గా కూడా కనెక్ట్ అయిన వేల మంది డీలర్లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Upasana: ఉపాసన కామినేని ఐస్లాండ్ పర్యటన రద్దు.. కారణం ఏంటంటే?

చంద్రహాస్ బరాబర్ ప్రేమిస్తా మూవీ టీజర్ రిలీజ్ చేసిన వి.వి.వినాయక్

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ లో కథే హీరో. స్క్రీన్ ప్లే ఊహకు అందదు : చిత్ర యూనిట్

నా ఆఫీసులో ప్రతి గోడ మీద హిచ్‌కాక్‌ గుర్తులు ఉన్నాయి : దర్శకులు వంశీ

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ సెకండ్ షెడ్యూల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Beauty Tips, చలి కాలంలో చర్మ సంరక్షణ చిట్కాలు

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

లాస్ ఏంజిల్స్‌లో ఘనంగా నాట్స్ బాలల సంబరాలు

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments