Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడ, గుంటూరులో వరద బాధితులకు తాగునీటి పంపిణీని వేగవంతం చేయటానికి చర్యలు చేపట్టిన హెచ్‌సిసిబి

ఐవీఆర్
మంగళవారం, 10 సెప్టెంబరు 2024 (12:25 IST)
ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, గుంటూరు జిల్లాల్లో సంభవించిన వినాశకరమైన వరదలకు ప్రతిస్పందనగా, హిందుస్థాన్ కోకాకోలా బెవరేజెస్ (హెచ్‌సిసిబి) బాధితులకు అవసరమైన సహాయాన్ని అందించడానికి వనరులను సమీకరించింది. వరద సహాయ బాధితులకు తాగునీటిని అందించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హెచ్ ఆర్ డి, ఐటి , ఎలక్ట్రానిక్స్ మరియు రియల్ టైమ్ గవర్నెన్స్ (ఆర్ టిజి ) మంత్రి శ్రీ నారా లోకేష్‌తో కలిసి హెచ్‌సిసిబి పని చేసింది. కమ్యూనిటీ ఔట్రీచ్ కోసం కొనసాగుతున్న నిబద్ధతలో భాగంగా, హెచ్‌సిసిబి ఒక్కొక్కటి 1000 మిల్లీ లీటర్లు  పరిమాణం కలిగిన 60,000 కిన్లీ వాటర్ బాటిళ్లను ఏపీ  స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ & ఫైర్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్‌కు సరఫరా చేసింది.

ఈ ముఖ్యమైన పంపిణీని  శ్రీ పి. వెంకట రమణ, ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ - టెక్నికల్, ఆంధ్రప్రదేశ్ ఫైర్ సర్వీసెస్ ; శ్రీ టి. ఉదయ్ కుమార్, ఫైర్ సర్వీసెస్ అదనపు డైరెక్టర్ - అడ్మిన్, ఆంధ్రప్రదేశ్ ఫైర్ సర్వీసెస్; మరియు శ్రీమతి అన్నమ్మ టి, రీజనల్ కోఆర్డినేటర్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో అమలు చేయబడింది.  వారి భాగస్వామ్యం అత్యంత అవసరమైన వారికి నీటిని సమర్ధవంతంగా అందజేయడంలో కీలకపాత్ర పోషించింది.

"కమ్యూనిటీలకు, ముఖ్యంగా సంక్షోభ సమయాల్లో మద్దతు ఇవ్వడానికి హిందూస్థాన్ కోకా-కోలా బెవరేజెస్ లోతుగా కట్టుబడి ఉంది" అని హెచ్‌సిసిబి చీఫ్ పబ్లిక్ అఫైర్స్, కమ్యూనికేషన్స్ మరియు సస్టైనబిలిటీ ఆఫీసర్ హిమాన్షు ప్రియదర్శి అన్నారు. "స్వచ్ఛమైన త్రాగునీటిని అందించడం అనేది మనం తక్షణమే తీర్చగల ఒక క్లిష్టమైన అవసరం, వరద ప్రభావిత నివాసితులు ఎదుర్కొంటున్న కొన్ని కష్టాలను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది" అని అన్నారు. విపత్తు ఉపశమనం మరియు పునరుద్ధరణకు మద్దతు ఇవ్వడంలో తన ప్రయత్నాలను కొనసాగించడానికి హెచ్‌సిసిబి అంకితభావంతో ఉంది, ఈ ప్రకృతి విపత్తు తర్వాత తమ జీవితాలను పునర్నిర్మించుకోవడంలో కష్టపడుతున్న బాధిత వ్యక్తులు మరియు కుటుంబాలకు సహాయం చేయాలనే లక్ష్యంతో ఉంది.<>

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sankranthiki Vasthunam: గోదారి గట్టు మీద రామచిలుకవే పాటకు థియేటర్‌లో స్టెప్పులేసిన జంట

Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్ ఫ్యామిలీ గురించి తెలుసా.. ఆస్తుల సంగతేంటి?

నా లెగసీని కంటిన్యూ చేసే వారిలో కిషోర్ ఒకరు : బ్రహ్మానందం

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ తో మోసం చేశారన్న వెన్నెల కిశోర్

కిరణ్ అబ్బవరం దిల్ రూబా నుంచి సింగిల్ అగ్గిపుల్లె..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

HMPV వ్యాధి నిరోధించేందుకు చిట్కాలు

శిశువు గుండె భాగంలోకి వెళ్లిపోయిన లివర్, కిడ్నీలు, పేగులు: ప్రాణాల‌ను కాపాడిన లిటిల్ స్టార్- షీ ఉమెన్- చిల్డ్రన్ హాస్పిటల్‌

కిడ్నీలను డ్యామేజ్ చేసే అలవాట్లు, ఏంటవి?

పచ్చి బఠానీలు తింటే కలిగే ప్రయోజనాలు

సర్వరోగ నివారిణి తులసి రసం తాగితే?

తర్వాతి కథనం
Show comments