Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పాకెట్ మనీని విరాళంగా ఇచ్చిన చిన్నారులు.. చంద్రబాబు కితాబు (వీడియో)

Advertiesment
Students

సెల్వి

, సోమవారం, 9 సెప్టెంబరు 2024 (16:25 IST)
Students
పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలం పడమర విప్పర్రులోని శ్రీ విద్యా నికేతన్ పాఠశాలకు చెందిన ఈ చిన్నారులు వరద బాధితుల కోసం తమ వంతు సాయం చేశారు. ఈ వీడియో తనను ఎంతగానో కదిలించిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎక్స్‌లో పోస్టు చేశారు. 
 
విజయవాడ వరద బాధితులను ఆదుకోవడానికి తమ పాకెట్ మనీని విరాళంగా ఇవ్వడం ద్వారా ఆ చిన్నారులు అసాధారణ దయాగుణాన్ని ప్రదర్శించారు.
 
విద్యార్థుల్లో ఇలాంటి ఉదాత్తమైన విలువలను పెంపొందించడం, అవసరమైన వారి పట్ల శ్రద్ధ వహించడం, ప్రాముఖ్యతను వారికి బోధించిన పాఠశాల యాజమాన్యాన్ని తాను అభినందిస్తున్నానని చంద్రబాబు కొనియాడారు. 
 
ఇటువంటి మంచి కార్యాలు మానవత్వంపై మన విశ్వాసాన్ని పునరుద్ధరిస్తాయని.. దయగల, బాధ్యతగల పౌరులు భవిష్యత్తును ఎంతగానో తీర్చిదిద్దుతారని చంద్రబాబు అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుపతి, కడపలో 40 ఎర్రచందనం దుంగలు స్వాధీనం, ముగ్గురు అరెస్ట్