పసిడి ధరల తగ్గుదల.. ఊరిస్తున్న ధరలు...

Webdunia
ఆదివారం, 28 మార్చి 2021 (15:06 IST)
దేశంలో బంగారం ధరలు క్రమేణా తగ్గుతున్నాయి. వారం రోజులుగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఈ తగ్గుతున్న ధరలు ఆభరణాల ప్రేమికులను ఊరిస్తున్నాయి. 10 గ్రాముల ధర రూ.50 వేలకు చేరి, అందుబాటులో లేకుండా పోతుందని ఆందోళన చెందినవారు, ఇప్పుడు సంతోషంగా ఆభరణాలను కొనుక్కోవచ్చు. 
 
ఆదివారం 100 గ్రాముల బంగారం ధర రూ.7,600 తగ్గింది. దీంతో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ఆదివారం రూ.43,920కి తగ్గింది. ఈ వారం ప్రారంభంలో ఏప్రిల్ డెలివరీ కోసం గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు రూ.44,974 వద్ద ప్రారంభమైంది. ఒక రోజు తర్వాత 100 గ్రాములకు రూ.100 చొప్పున తగ్గింది. మార్చి 23న 100 గ్రాములకు రూ.1,200 తగ్గింది. బుధ, గురు, శుక్రవారాల్లో ఈ తగ్గుదల కొనసాగింది. 
 
మరోవైపు, గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ వెల్లడించిన వివరాల ప్రకారం ఆదివారం వివిధ నగరాల్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు క్రింది విధంగా ఉన్నాయి. 
 
ఢిల్లీ -  రూ.44,050, ముంబై - రూ.43,000, చెన్నై - రూ.42,320, అహ్మదాబాద్ - రూ.44,440, కేరళ - రూ.41,900, లక్నో - రూ.44,050, బెంగళూరు - రూ.41,900, పుణే - రూ.43,000, విశాఖపట్నం - రూ.41,900, జైపూర్ - రూ.44,050, పాట్నా - రూ.43,000, చండీగఢ్ - రూ.44,050 చొప్పున ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డాక్టర్ రాజశేఖర్ కాలికి గాయం.. కొన్ని వారాల పాటు విశ్రాంతి అవసరం

Prerna Arora: హిందీ లోనే కాక దక్షినాది లో కూడా ఆదరణ పొందుతున్న ప్రేరణ అరోరా

Kiran Abbavaram: చెన్నై లవ్ స్టోరీ సినిమా కంటెంట్ పై కాన్ఫిడెంట్ : కిరణ్ అబ్బవరం

Suriya4: సూర్య, నజ్రియా నజీమ్ చిత్రం షూటింగ్ షెడ్యూల్‌ ప్రారంభమైయింది

Drishyam 3: దృశ్యం 3 వంటి కథలు ముగియవు - పనోరమా స్టూడియోస్, పెన్ స్టూడియోస్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments