Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలంగాణ ఉద్యోగులకు తీపికబురు : 30 శాతం ఫిట్మెంట్

Advertiesment
తెలంగాణ ఉద్యోగులకు తీపికబురు : 30 శాతం ఫిట్మెంట్
, సోమవారం, 22 మార్చి 2021 (12:45 IST)
తెలంగాణ‌ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల‌కు, ఉపాధ్యాయుల‌ తీపి కబురు చెప్పింది. ఏకంగా 30 శాతం ఫిట్‌మెంట్ ప్ర‌క‌టించారు. అలాగే, రాష్ట్రంలోని ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌సును 61 సంవ‌త్స‌రాల‌కు పెంచింది. ఈ మేరకు రాష్ట్ర అసెంబ్లీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ప్రకటించారు. 
 
శాస‌న‌స‌భ వేదిక‌గా పీఆర్సీపై సీఎం కేసీఆర్ ప్రకటన చేస్తూ, 30 శాతం ఫిట్‌మెంట్ ఉత్త‌ర్వులు ఏప్రిల్ 1, 2020 నుంచి అమ‌ల్లోకి వ‌స్తాయ‌న్నారు. త్వ‌ర‌లోనే ప్ర‌మోష‌న్ల ప్ర‌క్రియ చేప‌ట్టి.. ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తామ‌న్నారు. 
 
ఔట్ సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌, హోంగార్డుల‌కు, వీఆర్ఏ, ఆశా వ‌ర్క‌ర్లు, అంగ‌న్‌వాడీల‌కు కూడా పీఆర్సీ వ‌ర్తిస్తుంద‌ని సీఎం ప్ర‌క‌టించారు. క‌రోనా వ‌ల్ల ఈసారి వేత‌న స‌వ‌ర‌ణ ఆలస్య‌మైంద‌న్నారు. ఉద్యోగుల వేత‌న స‌వ‌ర‌ణ ప్ర‌తి 5 సంవ‌త్స‌రాల‌కు ఒక‌సారి చేసుకుంటున్నామ‌ని చెప్పారు. 
 
పీఆర్సీపై త్రిస‌భ్య క‌మిటీ అన్ని ఉద్యోగ సంఘాల‌తో చ‌ర్చించింది. ఉద్య‌మంలో ఉద్యోగుల పాత్ర అనిర్వ‌చ‌నీయ‌మైన‌ది అని కొనియాడారు. ఉమ్మ‌డి ఏపీలో టీఎన్జీవో తెగించి పోరాడింద‌న్నారు. తెలంగాణ సోయిని నిలిపి ఉంచ‌డంలో టీఎన్జీవో స్ఫూర్తి మ‌రువ‌లేనిది అని స్ప‌ష్టం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నీతి ఆయోగ్ చెప్పిందని ప్రైవేట్ పరం చేసేస్తారా? ఆర్. నారాయణమూర్తి