Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మ‌హేష్ అన్న‌ట్లు కెరీ‌లో బెస్ట్ మూవీ అయిందిః వంశీ పైడిప‌ల్లి

Advertiesment
మ‌హేష్ అన్న‌ట్లు కెరీ‌లో బెస్ట్ మూవీ అయిందిః వంశీ పైడిప‌ల్లి
, మంగళవారం, 23 మార్చి 2021 (06:18 IST)
Maharshi team cake catting
67వ జాతీయ అవార్డుల‌ను కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమా స‌త్తా చాటింది. సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ హీరోగా న‌టించిన 25వ చిత్రం ‘మ‌హ‌ర్షి’ జాతీయ స్థాయిలో రెండు అవార్డుల‌ను ద‌క్కించుకుంది. జాతీయ ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా మహర్షి సినిమాకుగానూ రాజు సుందరం ఎంపికయ్యారు. అలాగే ఉత్తమ వినోదాత్మక చిత్ర విభాగంలో మహర్షి సినిమా ఎంపికైంది. మ‌హ‌ర్షి చిత్రాన్ని వంశీ పైడిప‌ల్లి తెర‌కెక్కించ‌గా దిల్‌రాజు, సి.అశ్వినీద‌త్‌, పి.వి.పి నిర్మించారు. ఈ సంద‌ర్భంగా...
 
ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి మాట్లాడుతూ - ‘‘మహర్షి సినిమా విడుదలై దాదాపు రెండేళ్లు దాటింది. సినిమా విడుదలైనప్పుడు సినిమా గురించి అంద‌రూ ఎంత పాజిటివ్‌గా రెస్పాండ్ అయ్యారో తెలిసిందే. అదే ఇప్పుడు జాతీయ స్థాయిలో అవార్డుల రూపంలో ట్రాన్స్‌ఫామ్ అయ్యింది. నాకైతే మ‌రుపురాని క్ష‌ణాలివి. దిల్‌రాజుగారికి, ద‌త్‌గారు, పివిపిగారికి, హ‌రి, సాల్మోన్‌ల‌కు చాలా ఆనందంగా ఉంది. గత ఏడాది మార్చి 22న లాక్డౌన్ ప్ర‌క‌టించిన‌ప్పుడు ఏమై పోతామో అనిపించింది. అయితే ఇప్పుడు ఇదే రోజున అవార్డులు రావ‌డంతో ఊపిరి వ‌చ్చిన‌ట్ల‌య్యింది. ఈ అవార్డును తెలుగు ప్రేక్ష‌కుల‌కు అంకితం చేస్తున్నాను. క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌తో మెసేజ్‌ను మిక్స్ చేసి మ‌హ‌ర్షి సినిమాను తెర‌కెక్కించాం. సినిమాను తెలుగుప్రజలు ఎంత‌గానో ఆద‌రించారు. తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఈ అవార్డుల‌ను అంకితం ఇస్తున్నాను. అలాగే ఎంటైర్ యూనిట్‌కు కూడా ఈ అవార్డును అంకిత‌మిస్తున్నాను. మేజ‌ర్ ఈ సినిమా క్రెడిట్ మ‌హేశ్‌గారికే ద‌క్కుతుంది. నేను నెరేష‌న్ ఇచ్చిన‌ప్పుడు ఆయ‌న హ్యాపీగా ఫీలై, వంశీ, నువ్వు చెప్పిన‌ట్లుగా సినిమాను తెర‌కెక్కిస్తే వ‌న్ ఆఫ్ ది బెస్ట్ మూవీ ఆఫ్ మై కెరీర్ అవుతుంద‌న్నారు. అదే న‌మ్మ‌కంతో ముందుకెళ్లాం. 2019, మే 9న సినిమా విడుద‌లైంది. మా న‌మ్మ‌కాన్ని ప్రేక్ష‌కులు నిజం చేశారు. ఇప్పుడు మా న‌మ్మ‌కాన్ని నిజం చేస్తూ నేష‌న‌ల్ అవార్డు రావ‌డం చాలా సంతోషాన్నిచ్చింది. జ్యూరీకి థాంక్స్‌. దేవిశ్రీప్ర‌సాద్ అద్భుత‌మైన సంగీతాన్ని అందించారు. రాజు సుంద‌రం గారికి ఈ సినిమాకు బెస్ట్ కొరియోగ్రాఫ‌ర్‌గా అవార్డు రావ‌డం ఆనందాన్నిచ్చింది. స‌పోర్ట్ ఇచ్చిన అందిరికీ థాంక్స్‌. మ‌హేశ్‌గారితో పాటు పూజా హెగ్డేకు, జ‌గ‌ప‌తిబాబు, న‌రేష్‌, సాయికుమార్ ఇలా ఎంటైర్ యూనిట్‌కు థాంక్స్‌. అలాగే జాతీయ అవార్డు ద‌క్కించుకున్న జెర్సీ టీమ్‌కు కూడా అభినంద‌న‌లు’’ అన్నారు. 
 
webdunia
Maharshi team Tapasulu
నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ ‘‘67వ జాతీయ అవార్డుల్లో మహర్షి సినిమాకు అవార్డులు రావడం ఎంతో ఆనందంగా ఉంది. మేం న‌మ్మిన ఆలోచ‌న‌ను సినిమాగా చేసి ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చిన్న‌ప్పుడు ప్రేక్ష‌కులు దానికి విజ‌యాన్ని అందించారు. ఇప్పుడు జ్యూరీ కూడా నేష‌న‌ల్ అవార్డుకు ఎంపిక చేయడం మ‌రపురాని ఆనంద క్ష‌ణాలు. వంశీ అండ్ టీమ్ ఎంతో క‌ష్ట‌ప‌డి.. మ‌హేశ్ వంటి హీరోతో మెసేజ్‌ను ఇస్తూ క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌తో స‌క్సెస్‌ఫుల్ సినిమాను చేశారు. అలాగే మా బ్యాన‌ర్‌కు మ‌రో గొప్ప సినిమాను అందించిన మ‌హేశ్‌గారికి థాంక్స్‌. అలాగే ద‌త్తుగారికి, పివిపిగారికి కూడా ధ‌న్య‌వాదాలు. రాజు మాస్ట‌ర్‌గారికి కంగ్రాట్స్‌. లాక్ డౌన్ అయిన ఏడాది త‌ర్వాత తెలుగు సినిమాకు ఈ అవార్డులు రావ‌డం ఎంతో హ్యాపీ మూమెంట్. అలాగే ఈ ఏడాది సంక్రాంతి నుంచి తెలుగు సినిమాల‌న్నీ మంచి విజ‌యాల‌ను సాధిస్తున్నాయి. ఇండియా మొత్తం మీద తెలుగు సినిమా బ్రైట్‌గా ఉంది. ఈ ఏడాది సినీ ఇండ‌స్ట్రీ ఇంకా బావుంటుంది. ఇంకా మంచి సినిమాలు వ‌స్తాయి. అలాగే హిందీలో మేం రీమేక్ చేస్తున్న జెర్సీ సినిమాకు కూడా నేష‌న‌ల్ అవార్డు రావ‌డం బోన‌స్ హ్యాపీయెస్ట్ మూమెంట్‌. జెర్సీ టీమ్‌కి కూడా అభినంద‌న‌లు’’ అన్నారు,.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉగాదికి ఆది సాయి కుమార్ కొత్త సినిమా