Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగారం, వెండి ధరల పెంపు.. కారణం డొనాల్డ్ ట్రంప్ ప్రకటనే కారణం..

సెల్వి
సోమవారం, 14 జులై 2025 (11:21 IST)
బంగారం, వెండి ధరలు బాగా పెరిగాయి. బంగారం రూ.400 కంటే ఎక్కువ పెరిగింది. వెండి కిలోగ్రాముకు రూ.2,700 కంటే ఎక్కువ పెరిగింది. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) ప్రకారం, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.97,511కి పెరిగింది. ఇది వారం క్రితం రూ.97,021గా ఉంది. రూ.490 పెరిగింది. 
 
మునుపటి వారంలో, బంగారం ఇప్పటికే 10 గ్రాములకు రూ.1,237 పెరిగింది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.89,320కి పెరిగింది. ఇది రూ.88,871గా ఉంది. ఇదే సమయంలో, 18 క్యారెట్ల బంగారం రూ.72,766 నుండి రూ.73,133కి పెరిగింది.
 
వెండి కూడా బాగా పెరిగి, కిలోకు రూ.2,710 పెరిగి రూ.1,10,290కి చేరుకుంది.గత వారం రూ.1,07,580గా ఉంది.
వారం ప్రాతిపదికన వెండి కిలోకు రూ.1.10 లక్షలకు మించి ముగియడం ఇదే మొదటిసారి, ధరలు రికార్డు స్థాయిలో ఉన్నాయి.

విలువైన బంగారం ధరలు పెరిగేందుకు ప్రపంచ అనిశ్చితి కారణమని చెబుతున్నారు. కెనడా, యూరప్, ఇతర దేశాల వంటి కీలక వాణిజ్య భాగస్వాములపై సుంకాలకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన ప్రపంచ మార్కెట్లలో పెరుగుతున్నధరలకు కారణమైంది. 
 
ఈ సంవత్సరం జనవరి 1 నుండి, 24 క్యారెట్ల బంగారం ధర రూ.21,349 లేదా 28.03 శాతం పెరిగి 10 గ్రాములకు రూ.76,162 నుండి రూ.97,511కి చేరుకుంది.
 
అదేవిధంగా, వెండి ధర కూడా రూ.24,273 లేదా 28.21 శాతం పెరిగి కిలోగ్రాముకు రూ.86,017 నుంచి రూ.1,10,290కి చేరుకుంది. వెండి ధర ఇప్పటివరకు ఇదే అత్యధిక ధర. ఈ ఏడాది జూన్ 18న నమోదైన కిలోకు రూ.1,09,550గా ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kantara Chapter 1: రెబెల్ స్టార్ ప్రభాస్ లాంచ్ చేసిన రిషబ్ శెట్టి కాంతార: చాప్టర్ 1 ట్రైలర్ (video)

Mardaani 3: నవరాత్రి ఆరంభం సందర్భంగా రాణి ముఖర్జీ మర్దానీ 3 పోస్టర్ విడుదల

అనకొండ తిరిగి వచ్చేసింది: పాల్ రుడ్, జాక్ బ్లాక్‌లతో నవ్వులు, యాక్షన్, థ్రిల్స్ పక్కా

ఓజీ చిత్రానికి సహకరించిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కృతజ్ఞతలు: డిప్యూటీ సీఎం పవన్

వేట‌కు సిద్ధ‌మైన‌ బెంగాల్ టైగ‌ర్, OG ట్రైల‌ర్‌పై హీరో సాయి దుర్గ తేజ్‌రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Navratri Snacks: నవరాత్రి స్నాక్స్.. సగ్గుబియ్యం టిక్కా.. అరటి పండ్ల చిప్స్ సింపుల్‌గా..

కామెర్ల వ్యాధితో రోబో శంకర్ కన్నుమూత, ఈ వ్యాధికి కారణాలు, లక్షణాలేమిటి?

రీస్టార్ట్ విత్ ఇన్పోసిస్.. మహిళా ఉద్యోగులకు శుభవార్త.. ఏంటది?

యాలకలు 6 ప్రయోజనాలు, ఏంటవి?

పండుగ కలెక్షన్ మియారాను విడుదల చేసిన తనైరా

తర్వాతి కథనం
Show comments