Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

Advertiesment
Uchi Usirika

ఠాగూర్

, సోమవారం, 7 జులై 2025 (18:12 IST)
ప్రకృతి ఎన్నో అద్భుతాలు నిక్షిప్తమైవున్నారు. అనేక వనమూలికలు దాగివున్నాయి. ఇలా ఎన్నో అద్భుతాలు కలిగివున్నాయి. చాలా సార్లు అవి మన కళ్ల ముందే కనిపిస్తూ ఉంటాయి. కానీ వాటి ప్రాముఖ్యం తెలియక పట్టించుకోం. అలాంటి ఒక మొక్క ఉచ్చి ఉసిరిక.

ఈ మొక్క కలలో నానో బంగారు కణాలు ఉంటాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఆ మొక్క గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

నీళ్లు ఎక్కువగా లభించని ప్రాంతాల్లో ఉచ్చి ఉసిరిక మొక్క ఎక్కువగా పెరుగుతుంది. ఈ మొక్కకు ఫిలంథస్ విరాటస్ అనే శాస్త్రీయ నామం ఉంది.

ఈ మొక్క 30 నుంచి 60 సెంటీమీటర్ల ఎత్తు పెరుగుతుంది. పొదలా గుబురుగా వ్యాపిస్తుంది. దీని ఆకులు చిన్నగా ఉంటాయి. ఈ మొక్కకు ఎర్రటి పువ్వులు పూస్తాయి. ఈ పూల నుంచి చిన్నచిన్న కాయలు కాస్తాయి. మొదట పచ్చగా ఉన్నా. బాగా పండిన తర్వాత బ్రౌన్ రంగులోకి మారతాయి.

ఈ మొక్కను ఆయిర్వేద వైద్యంలో కొన్ని వేల ఏళ్లుగా కామెర్లు, జీర్ణ కోశ సమస్యలు, చర్మ సంబంధిత సమస్యల పరిష్కారానికి ఉపయోగిస్తున్నారు. ఇక ఈ మొక్క ఆకుల నుంచి నానో బంగారం కణాలు. సంగ్రహించవచ్చని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ దిశగా అనేక ప్రయోగాలు జరుగుతున్నాయి. నీళ్ల సదుపాయం ఎక్కువగా లేని ప్రాంతాల్లో ఈ మొక్కను పెంచుకోవటం వల్ల అనేక రకాల ప్రయోజనాలు ఉంటాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!