Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బెజవాడలో దారుణం : ఇంటి యజమానిని హత్య చేసి నగలతో పని మనిషి పరార్

Advertiesment
murder

ఠాగూర్

, శుక్రవారం, 11 జులై 2025 (12:52 IST)
బెజవాడలో దారుణం జరిగింది. ఇంటి యజమాని
ని పని మనిషి చంపేసి, డబ్బు, నగలతో పారిపోయింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బొద్దులూరి వెంకట రామారావు (70) తన తల్లి సరస్వతితో కలిసి మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్టీఆర్ కాలనీలో ఉంటున్నారు. వృద్ధురాలైన తల్లిని చూసుకునేందుకు మూడు రోజుల క్రితం అనూష అనే పని మనిషిని పెట్టుకున్నారు. అనూష అదే ఇంట్లో వారితో కలిసి ఉంటోది.
 
ఈ క్రమంలో గత అర్థరాత్రి ఒంటిగంట సమయంలో రామారావు గదిలో లైట్లు వెలిగి ఉండటంతో అనుమానం వచ్చిన సరస్వతి వచ్చిచూడగా కుమారుడు అపస్మారకస్థితిలో మంచంపై పడి ఉండటంతో ఆందోళన చెందారు. మంచమీద, రామారావుపై కారం చల్లి ఉండటాన్ని గమనించారు. పని మనిషి అనూష కనిపించకపోవడంతో, బీరువా పగలగొట్టి ఉండటంతో పక్కింటి వారి సాయంతో పోలీసులకు సమాచారం అందించారు. 
 
వారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. శుక్రవారం ఉదయం ఆరు గంటల సమయంలో అనూషను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. నిందితురాలైన తన భర్త సాయంతో రామారావు ముఖంపై దిండుపెట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Tirumala: తిరుమల డెయిరీ మేనేజర్ ఆత్మహత్య- ఉరేసుకునే ముందు చెల్లికి ఈ-మెయిల్ (video)