Webdunia - Bharat's app for daily news and videos

Install App

వచ్చే ఆరు నెలల్లో ఏపీ - తెలంగాణాలో 25 గోద్రెజ్ షోరూమ్‌లు : దేవ్ సర్కార్ వెల్లడి

Webdunia
గురువారం, 14 సెప్టెంబరు 2023 (17:30 IST)
వచ్చే ఆరు నెలల్లో తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాతో పాటు దక్షిణ భారతదేశంలో 25 షోరూమ్‌లను కొత్తగా ఏర్పాటు చేయనున్నట్టు ఆ కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ దేవ్ సర్కార్ వెల్లడించారు. ఆయన చెన్నైలో విలేకరులతో మాట్లాడుతూ, తమ వ్యాపారాన్ని మరింతగా విస్తరించుకునే చర్యల్లో భాగంగా, దక్షిణ భారత మార్కెట్‌పై దృష్టిసారించినట్టు చెప్పారు. ప్రస్తుతం తమ మార్కెట్ 22 శాతంగా ఉందని, ఇది 35 శాతానికి పెంచుకునే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుతం సౌత్ ఇండియా అంతటా 200 ప్లస్ చానెల్ భాగస్వాములను కలిగివున్నామన్నారు. ఒక్క తమిళనాడులోనే 52 చానెల్ పార్ట్‌నర్స్, 8 ఎక్స్‌క్లూజివ్ షోరూమ్స్, 90 రీటైలర్స్ షోరూమ్స్ ఉన్నాయన్నారు. ప్రస్తుంత తమిళనాడులో 10 ఎక్స్‌షోరూమ్‌లను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. వచ్చే 2026 సంవత్సరానికి రూ.350 కోట్ల ఆదాయాన్ని అర్జించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. 
 
అలాగే, వచ్చే ఆరు నెలల్లో తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో 25 షోరూమ్‌లను ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. ప్రస్తుతం ఉన్న 40 షోరూమ్‌లతో 25 శాతానికి పైగా ఈ విభాగంలో మార్కెట్ షేర్ కలిగివున్నట్టు చెప్పారు. 2026 నాటికి మార్కెట్ వాటా 30 శాతం వాటాను కైవసం చేసుకోవచ్చని దేవ్ సర్కార్ తెలిపారు. దక్షిణ భారతదేశం అంతటా 200 ప్లస్ ఛానెల్ భాగస్వాములను కలిగి ఉన్నారని తెలిపారు. చెన్నైలో కంపెనీ ఎక్కువగా లివింగ్ రూమ్, బెడ్‌రూమ్, కిచెన్‌ల కేటగిరీపై ప్రధాన దృష్టి సారించినట్లు చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ అంతటా కంపెనీని బలోపేతం చేయడానికి మేము కట్టుబడి ఉన్నామన్నారు.
 
రాబోయే ఆర్థిక సంవత్సరంలో అన్ని ఉత్పత్తుల్లోనూ 25 శాతానికి పైగా గణనీయమైన వృద్ధిని సాధించడమే లక్ష్యమన్నారు. రాబోయే దసరా, దీపావళి పండుగ వేడుకలకు అనుగుణంగా, గోద్రెజ్ ఇంటీరియో 30 శాతం వరకు డిస్కౌంట్‌లను అందిస్తోంది. సెప్టెంబరు 15 నుండి నవంబర్ 15 వరకు ప్రత్యేకమైన స్క్రాచ్ కార్డ్ ద్వారా ఉచిత ఫర్నిచర్‌ను గెలుచుకునే అవకాశాన్ని కల్పిస్తామని తెలిపారు. తమ కంపెనీకి ముంబై, ఖలాపూర్, హరిద్వార్, షిర్వాల్, భగవాన్‌పూర్‌లలో 7 తయారీ కేంద్రాలు ఉన్నాయని ఆయన ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలాంటి పాత్రలు చేయకూడదని నిర్ణయించుకున్నా : పరుచూరి గోపాలక్రిష్ణ

నయనతార బర్త్‌డే స్పెషల్.. రాక్కాయిగా లేడీ సూపర్ స్టార్

స్టార్ హీరోల ఫంక్షన్ లకు పోటెత్తిన అభిమానం నిజమేనా? స్పెషల్ స్టోరీ

'పుష్ప-2' ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ గ్రాండ్ సక్సస్సేనా?

పెళ్లికి ముందే శోభితా ధూళిపాళ కీలక నిర్ణయం.. ఏంటది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉడికించిన వేరుశనగ పప్పు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మహిళల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. రోజూ ఓ కోడిగుడ్డు తినాల్సిందేనట

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తిరుపతిలో తమ మొదటి స్టోర్‌ను ప్రారంభించిన ప్రముఖ లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ డురియన్

తర్వాతి కథనం
Show comments