Webdunia - Bharat's app for daily news and videos

Install App

డైనవుట్‌ గ్రేట్‌ ఇండియన్‌ రెస్టారెంట్‌ ఫెస్టివల్‌: రెస్టారెంట్ బిల్లులపై 50% తగ్గింపు

Webdunia
గురువారం, 25 ఫిబ్రవరి 2021 (18:00 IST)
ప్రతి ఆకర్షణీయమైన ప్రకటన వెనుక రహస్య నిబంధనలు ఏవో ఉంటాయి. కానీ భారతదేశంలో అతిపెద్ద డైనింగ్‌ ఔట్‌, రెస్టారెంట్‌ టెక్‌ పరిష్కారాల వేదిక డైనవుట్‌ మాత్రం తమ వినియోగదారులకు ఇలాంటి రహస్య నిబంధనలు లేదంటే పరిమితులు లేకుండా ఫ్లాట్‌ 50% తగ్గింపును రెస్టారెంట్‌ బిల్స్‌పై అందించబోతుంది.
 
ఈ సంస్థ తమ ఆరవ ఎడిషన్‌ డైనవుట్‌  గ్రేట్‌ ఇండియన్‌ రెస్టారెంట్‌ ఫెస్టివల్‌ను ప్రకటించింది. ఇది 26 ఫిబ్రవరి 2021 నుంచి మార్చి 31, 2021వ తేదీ వరకూ దేశవ్యాప్తంగా 20కు పైగా నగరాలలో 10వేలకు పైగా సుప్రసిద్ధ రెస్టారెంట్లలో జరుగనుంది. ఈ ఫెస్టివల్‌లో పాల్గొంటున్న సుప్రసిద్ధ హోటల్‌, రెస్టారెంట్‌ చైన్స్‌లో జెడబ్ల్యు మారియట్‌, రాడిసన్‌, పరంపర, ఎయిర్‌లైవ్‌, అమోఘమ్- ద లేక్‌ వ్యూ రెస్టారెంట్‌, ఫెయిర్‌ఫీల్డ్‌ బై మారియట్‌- పామ్స్‌ కిచెన్‌, టీ-గ్రిల్‌, మ్యాడ్‌ ఓవర్‌ డోనట్స్‌, పిజ్జా హట్‌, బార్బిక్యు నేషన్‌, కేఫ్‌ ఢిల్లీ హైట్స్‌ వంటివి ఉన్నాయి.
 
ఈ ఆఫరింగ్‌ను మరింత ఆకర్షణీయంగా మారుస్తూ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డులు వినియోగిస్తే అదనంగా 15% రాయితీని సైతం పొందవచ్చు. దీనితో పాటుగా ఇంటర్‌మైల్స్‌ వినియోగదారులు డైనవుట్‌ పే ద్వారా చేసే ప్రతి 40 రూపాయలపై ఒక ఇంటర్‌మైల్‌ పొందవచ్చు.
 
ఈ తాజా ఆఫర్‌ గురించి డైనవుట్‌ సీఈవో-కోఫౌండర్‌ అంకిత్‌ మెహరోత్రా మాట్లాడుతూ, ‘‘తమకున్న అతిపెద్ద సమస్య ఏమిటంటే, 50% రాయితీ అంటే, దానిని ఖచ్చితంగా తామందిస్తామనే అంశం వినియోగదారులకు చేరువ చేయడం. ఆన్‌లైన్‌ యుగంలో ఎన్నో బ్రాండ్లు భారీ రాయితీలంటూ ప్రకటనలు ఇస్తున్నాయి కానీ వాస్తవానికి అలా చేయడం లేదు. దీనివల్ల వినియోగదారులు నమ్మకం కోల్పోతున్నారు. ఇది పోగొట్టి, వారిలో నమ్మకం కలిగించే రీతిలో దీనిని తీర్చిదిద్దాం. 2021వ సంవత్సరం అందరికీ ఓ మరుపురాని సంవత్సరంగా నిలుస్తుందని భావిస్తున్నాం’’ అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments