ఎమాసోల్ అంతర్జాతీయ బ్రాండ్ అంబాసిడర్‌గా బ్లేజింగ్ క్రికెట్ స్టార్ శిఖర్ ధావన్ నియామకం. భారతీయ ఎఫ్‌ఎంసీజీ అగ్రగామి ఇమామీ లిమిటెడ్ ఇప్పుడు భారతీయ మార్కెట్‌ను తమ పూర్తి సరికొత్త, సమగ్రమైన గృహ పరిశుభ్రతా ఉత్పత్తుల శ్రేణి ఎమాసోల్‌తో తాకేందుకు సిద్ధమైంది. ఇప్పటి వరకూ వ్యక్తిగత సంరక్షణ మరియు ఆరోగ్య సంరక్షణ విభాగాలలో సత్తా చాటిన కంపెనీ, మొట్టమొదటిసారిగా గృహ సంరక్షణ విభాగంలో భారీ ప్రవేశాన్ని ఈ ఆవిష్కరణతో చేయనుంది.
ఎమాసోల్ శ్రేణి ఉత్పత్తుల క్రింద, ఇమామీ లిమిటెడ్ ఐదు ఉత్పత్తులను తయారుచేసి, విక్రయిస్తుంది. అవి,
ఎమాసోల్ డిస్‌ఇన్‌ఫెక్టెంట్ ఫ్లోర్ క్లీనర్
ఎమాసోల్ డిస్‌ఇన్‌ఫెక్టెంట్ టాయ్‌లెట్ క్లీనర్
ఎమాసోల్ డిస్‌ఇన్‌ఫెక్టెంట్ బాత్‌రూమ్ క్లీనర్
ఎమాసోల్ యాంటీబ్యాక్టీరియల్ డిష్‌వాష్ జెల్
ఎమాసోల్ ఆల్ పర్పస్ శానిటైజర్
భారతదేశపు మార్కెట్‌లో తొలిసారిగా 99.9% క్రిములను తొలగించడంతో పాటుగా వైరస్‌లు, క్రిములు మరియు బ్యాక్టీరియా నుంచి 24 గంటల వరకూ రక్షణను అందించే బీజీవీ24 అత్యాధునిక యాంటీమైక్రోబియాల్స్ యాక్షన్‌ను సైతం కలిగిన గృహ పరిశుభ్రతా శ్రేణి ఎమాసోల్. వరల్డ్ ప్యానెల్ కాంటార్ నివేదిక ప్రకారం, కోవిడ్ 19 కారణంగా, గృహ పరిశుభ్రతా ఉత్పత్తుల పరంగా వినియోగదారుల ప్రవర్తనలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. టాయ్‌లెట్ క్లీనర్ల వినియోగం 47% పెరిగితే, ఫ్లోర్స్ మాపింగ్ 41% మరియు డిస్‌ఇన్‌ఫెక్టెంటంట్‌ల వినియోగం 28% పెరిగింది. నీల్సన్ కేటగిరీ ట్రెండ్స్ ప్రకారం, గృహ పరిశుభ్రతా ఉత్పత్తుల వినియోగం భారీగా పెరగడంతో పాటుగా విస్తరణ పరంగా గణనీయమైన వృద్ధి నమోదు చేసింది. ఈ- కామర్స్ మార్గాలు దాదాపు80% వృద్థిని మహమ్మారి అనంతర వాతావరణంలో ఫ్లోర్ మరియు టాయ్‌లెట్ క్లీన్సర్ల పరంగా నమోదు చేశాయి.
ఎమాసోల్ గృహ పరిశుభ్రతా శ్రేణి ఉత్పత్తులను ఆవిష్కరిస్తున్నట్లుగా వెల్లడించిన శ్రీ మోహన్ గోయెంకా, డైరెక్టర్-ఇమామీ లిమిటెడ్ మాట్లాడుతూ, కోవిడ్-19 మహమ్మారి, ఇంటి పరిశుభ్రత పట్ల అప్రమత్తతను నూతన శిఖరాలకు తీసుకువెళ్లింది. ఆర్ధికపరంగా అన్ని వర్గాల ప్రజలూ ఎక్కువసార్లు తమ ఇంటిని శుభ్రపరుచుకోవడం ద్వారా గృహాలలో పరిశుభ్రతను నిర్వహించడం పట్ల ఎక్కువగా ఆందోళన చెందుతున్నారు. ఇంటిలో లేదా బయట ప్రాంతాలలో అత్యధికంగా స్పృశించే ప్రాంతాల ద్వారా కోవిడ్-19 సంక్రమించే ముప్పు అధికంగా ఉండటం వల్ల డోర్ నాబ్‌లు, ఫ్రిడ్జ్ హ్యాండిల్స్, కాలింగ్ బెల్స్, లైట్ స్విచ్‌లు, ఫోన్లు, కిచెన్ కౌంటర్ టాప్స్ మొదలైనవి తరచుగా శుభ్రపరచడం మరియు డిస్‌ఇన్‌ఫెక్టింగ్ చేయడం వంటి నూతన ప్రవర్తనలకు దారి తీస్తుంది.
ఓ విభాగంగా, గృహ పరిశుభ్రత దాదాపు 3 వేల కోట్ల రూపాయలుగా ఉండొచ్చు మరియు కోవిడ్ ముందస్తు నాటి పరిస్థితులతో పోలిస్తే ఇది రెండంకెల వృద్ధిని నమోదు చేస్తుంది. రాబోయే రోజులలో ఇది మరింత వేగంగా వృద్ధి చెందవచ్చని అంచనా. దీనిని ఒడిసిపట్టుకోవడంలో భాగంగా ఎమాసోల్ శ్రేణి గృహ పరిశుభ్రతా ఉత్పత్తుల పరిచయంతో గృహ పరిశుభ్రతా విభాగంలో మేము ప్రవేశించాం. ఎమాసోల్ శ్రేణిలో బలీయమైన ఇమామీ యొక్క అగ్రశ్రేణి బ్రాండ్ ఈక్విటీతో పాటుగా అత్యున్నత ఆర్ అండ్ డీ ఆవిష్కరణను జోడించాం. ఇవి 24 గంటల భద్రతను వైరస్‌లు, క్రిములు మరియు బ్యాక్టీరియా నుంచి అందిస్తాయి. భారత మార్కెట్‌లో ఈ తరహా ఉత్పత్తులు రావడం ఇది తొలిసారి. ఈ ఆవిష్కరణతో ప్రభావవంతమైన పరిశుభ్రతా ఉత్పత్తులను కోరుకునే వినియోగదారుల నుంచి ప్రోత్సాహకరమైన స్పందనను మేము అందుకోగలమని భావిస్తున్నాం. తద్వారా వారు అత్యున్నత స్థాయి బ్రాండ్ నమ్మకం అందుకోగలరు అని అన్నారు.
శిఖర్ ధావన్, బ్రాండ్ అంబాసిడర్-ఎమాసోల్ మాట్లాడుతూ, ఎమాసోల్ ఆవిష్కరణ ద్వారా గృహ సంరక్షణ విభాగంలో ప్రవేశించడం పట్ల ఇమామీని నేను అభినందిస్తున్నాను. గత కొద్ది సంవత్సరాలుగా నిరూపితమైన విశ్వసనీయత మరియు విస్తృతమైన, నమ్మకమైన వినియోగదారులతో లెజండరీ బ్రాండ్‌గా ఇమామీ స్థిరపడింది. పరిశుభ్రత యొక్క ప్రాముఖ్యతను ప్రపంచమంతా నొక్కి చెబుతున్న సమయంలో, తమ ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తూ మరో శక్తివంతమైన ఉత్పత్తి ఎమాసోల్‌ను ఆవిష్కరించేందుకు ఇమామీకి ఇది సరైన సమయం అని నేను నమ్ముతున్నాను. ఈ నూతన ఉత్పత్తి ఆవిష్కరణ చేసిన ఇమామీకి నా శుభాకాంక్షలు అని అన్నారు.
క్రిముల నుంచి రక్షణ పరంగా మెరుగైన భద్రతను అందించే రీతిలో బీజీవీ 24 అడ్వాన్డ్స్ యాంటీమైక్రోబియాల్ యాక్షన్ కలిగి ఉండటంతో పాటుగా తమ ఎమాసోల్ శ్రేణి కోసం అంతర్జాతీయ క్రికెటర్ శిఖర్ ధావన్‌ను తమ గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఇమామీ ఎంచుకుంది. లండన్ కేంద్రంగా కలిగిన డిజైన్ సంస్థ ఇవాల్వ్ క్రియేటివ్, ఈ ఎమాసోల్ గృహ పరిశుభ్రతా శ్రేణి కోసం ప్యాకేజింగ్‌ను అభివృద్ధి చేసింది. దీనిలో సరసమైన ధరలతో కూడిన నాణ్యతా ఉత్పత్తులు ఉన్నాయి. ఎమాసోల్ శ్రేణిని సాధారణ వాణిజ్యం, ఆధునిక వాణిజ్యం మరియు ఈ–కామర్స్ మార్గాలలో ప్రధానంగా నగర మెట్రో మార్కెట్‌లపై దృష్టి కేంద్రీకరించి ఆవిష్కరిస్తున్నారు. మొత్తంమ్మీద అమ్మకాల పరంగా అధిక భాగం తోడ్పాటును ఈ ప్రాంతాలు అందిస్తాయని అంచనా.
ఎమాసోల్ శ్రేణి ధరల వివరాలు:
ఎమాసోల్ డిస్‌ఇన్‌ఫెక్టెంటంట్ ఫ్లోర్ క్లీనర్ (సిట్రస్ మరియు లావెండర్)- 500 మిల్లీ లీటర్ల ధర 75 రూపాయలు కాగా, 975 మిల్లీ లీటర్ల ధర 140 రూపాయలు.
ఎమాసోల్ డిస్‌ఇన్‌ఫెక్టెంటంట్ టాయ్‌లెట్ క్లీనర్ -500 మిల్లీలీటర్లు ధర 70 రూపాయలు
ఎమాసోల్ డిస్‌ఇన్‌ఫెక్టెంటంట్ బాత్‌రూమ్ క్లీనర్- 500 మిల్లీలీటర్లు ధర 75 రూపాయలు
ఎమాసోల్ యాంటీ బ్యాక్టీరియల్ డిష్ వాష్ జెల్ (నిమ్మ)- 500 మిల్లీలీటర్లు ధర 95 రూపాయలు మరియు 900 మిల్లీ లీటర్ల రీఫిల్ పౌచ్ ధర 170 రూపాయలు
ఎమాసోల్ ఆల్ పర్పస్ శానిటైజర్ స్ర్పే- 25 మిల్లీ లీటర్ల ధర 30 రూపాయలు మరియు 500 మిల్లీ లీటర్ల ధర 199 రూపాయలు.