Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారతదేశంలో 1500 రెస్టారెంట్ల మైలురాయిని దాటిన డొమినోస్ పిజ్జా

Webdunia
శుక్రవారం, 18 ఫిబ్రవరి 2022 (17:39 IST)
భారతదేశ అతిపెద్ద పిజ్జా చెయిన్ అయిన డొమినోస్ పిజ్జా నేడిక్కడ తన 1500వ రెస్టారెంట్‌ను నోయిడా లోని ది స్కైమార్క్ బిల్డింగ్‌లో ప్రారంభించింది. ఈ రెస్టారెంట్‌ను జూబ్లియంట్ ఫుడ్ వర్క్స్ లిమిటెడ్ చైర్మన్ శ్రీ శ్యామ్ ఎస్ భర్తియా, కో- చైర్మన్ శ్రీ హరి ఎస్ భర్తియా, సీఈఓ, హోల్ టైమ్ డైరెక్టర్ శ్రీ ప్రతీక్ పోటా ప్రారంభించారు. ఇది నేషనల్ క్యాపిటల్ రీజియన్లో 100వ డొమినోస్ పిజ్జా రెస్టారెంట్. ఇవన్నీ కలసి ఈ నగరాన్ని ఈ బ్రాం డ్‌కు అత్యంత కీలక మార్కెట్లలో ఒకటిగా చేశాయి.

 
అధిక శాతంగా ఉన్న యువత, శ్రామిక జనాభా కారణంగా భారతీయ ఫుడ్ సర్వీస్ పరిశ్రమ గత దశాబ్ది కాలంలో ము మ్మర వృద్ధిని, బయటి ఆహారపదార్థాలను తినే తరచుదనం అధికం కావడాన్ని చవిచూసింది. కోవిడ్ మహమ్మారి తరువాత ఈ పరిశ్రమ వ్యవస్థీకృత రంగం దిశగా మార్పును చూసింది. కొనుగోలుదారులు పరిశుభ్రత, సురక్షిత అంశాలకు ప్రాధాన్యం ఇవ్వడం అధికమైపోయింది. దాంతో వారు సురక్షిత, రుచికరమైన అనుభూతుల కోసం విశ్వసనీయ క్యూఎస్ఆర్ బ్రాండ్ల వైపు మళ్లడం మొదలైంది. ఏళ్లుగా డొమినోస్ బ్రాండ్ కొనుగోలుదారుల విశ్వాసాన్ని చూరగొంటూ వచ్చింది.

 
మహమ్మారి సమయంలో చేపట్టిన జీరో కాంటాక్ట్ డెలివరీ, జీరో కాంటాక్ట్ టేక్ అవే, డ్రైవ్ ఎన్ పిక్ వంటి కార్యక్రమాల కారణంగా, డొమినోస్‌కు కొనుగోలుదారులు ఇచ్చే ప్రాధాన్యం, విశ్వాసం మరింత అధికమైపోయాయి. భారతదేశంలో పిజ్జా విభాగంలో ఆధిక్యపూర్వక మార్కెట్ షేర్‌తో డొమినోస్ నెం.1 క్యూఎస్ఆర్ బ్రాండ్‌గా ఉంది. బ్రాండ్ డొమినోస్ ఉనికి, పటిష్ఠత భారతదేశంలో భారతీయ ఫుడ్ సర్వీస్ పరిశ్రమ వ్యవస్థీకృతం కావడంలో కీలకపాత్ర పోషించాయి.

 
పెరిగిపోతున్న వినియోగదారుల ప్రాధాన్యం, డిమాండ్లకు అనుగుణంగా డొమినోస్ శరవేగంగా విస్తరిస్తోంది. మహమ్మారి ఉన్నప్పటికీ, 2021 ఏడాదిలో 200 కొత్త డొమినోస్ రెస్టారెంట్లను ప్రారంభించింది. ఈ బ్రాండ్ ఇప్పుడు 322 నగరాల్లో ఫుల్ సర్వీస్ రెస్టారెంట్, డెల్కో (ఓన్లీ డెలివరీ అండ్ టేక్ అవే రెస్టారెంట్), ఫుడ్ కోర్టులు వంటి వివిధ స్టోర్ ఫార్మాట్లలో ఉనికి కలిగి ఉంది. ఈ 322 నగరాలకు సంబంధించి క్యూఎస్ఆర్ బ్రాండ్ 165 నగరాల్లో ఉంది, రుచికరమైన, సురక్షితమైన ఆహారానికి సంబంధించి కొనుగోలుదారుల అవసరాలను తీర్చగలుగుతోంది.

 
డొమినోస్ విస్తరించబడిన నెట్వర్క్ ఈ రెస్టారెంట్లను వినియోగదారులకు మరింత చేరువలోకి తీసుకువచ్చింది. భారతదేశంలో అత్యంతగా అభిమానించే నైబర్ హుడ్ పిజ్జాగా దీన్ని చేసింది. 1500 స్టోర్ల విస్తృత నెట్ వర్క్, సాంకేతికతలో వ్యూహాత్మక పెట్టుబడులు డొమినోస్ చాలా డెలీవరీలకు తన డెలివరీ సమయాన్ని 30 నిమిషాల నుంచి 20 నిమిషాలకు తగ్గించుకునేందుకు తోడ్పడింది. పిజ్జాలను వేడిగా, తాజాగా డెలివరీ చేయడం ద్వారా కస్టమర్ల ఆనందాన్ని పెంపొందించగలిగింది.

 
ఈ సందర్భంగా జూబ్లియంట్ ఫుడ్ వర్క్స్ లిమిటెడ్ చైర్మన్ శ్రీ శ్యామ్ ఎస్ భర్తియా, కో- చైర్మన్ శ్రీ హరి ఎస్ భర్తియా మాట్లాడుతూ, ‘‘నేడు 1500వ రెస్టారెంట్‌ను, మరీ ముఖ్యంగా ఈ మహమ్మారి కష్టాల సమయంలోనూ ప్రారంభించడం మాకెంతో ఆనందదాయకం. డొమినోస్ పిజ్జా ఇండియాలో ప్రతి ఒక్కరికీ ఇదో మైలురాయి సందర్భం. పిజ్జా తినడాన్ని ఒక అనుభూతిగా మార్చేందుకు ఏళ్ల కొద్దీ చేసిన నిర్విరామ ప్రయత్నాలు నిజమయ్యాయి.

 
వినూత్నత ఉత్పాదనలను అందించడం కావచ్చు, లేదంటే ఆనందదాయక డెలివరీ, డైనింగ్ అనుభూతులు కావచ్చు, కస్టమర్ ఆనందాన్ని అందించేందుకు అధునాతన సాంకేతికతను అనుసరించడం ద్వారా ప్రమాణాలను పెంచడంపై మేం దృష్టి పెట్టాం. మా నెట్వర్క్‌ను మరింతగా విస్తరించుకోవడాన్ని, పటిష్ఠం చేయడాన్ని, భారతదేశ నైబర్ హుడ్ పిజ్జారియాగా మా స్థానాన్ని పటిష్ఠం చేసుకోవడాన్ని, భారతదేశ నెం.1 పిజ్జా బ్రాండ్‌గా ఉండడాన్ని మేం కొనసాగిస్తాం’’ అని అన్నారు.

 
ఈ ప్రారంభోత్సవం సందర్భంగా, జూబ్లియంట్ ఫుడ్ వర్క్స్ లిమిటెడ్ సీఈఓ, హోల్ టైమ్ డైరెక్టర్ శ్రీ ప్రతీక్ పోటా మా ట్లాడుతూ, ‘‘1500వ డొమినోస్ పిజ్జా రెస్టారెంట్ మైలురాయిని అధిగమించడం అనేది ఓ వ్యాపార విజయం మాత్రమే కాదు, ఈ బ్రాండ్ కు గల కస్టమర్ల ఆదరణకు అదో నిదర్శనం. మార్కెట్ లీడర్ గా మేం వినూత్నతను,  డొమినోస్ పిజ్జాతో వారి అనుభూతులను ఆనందదాయకం చేయడాన్ని కొనసాగించనున్నాం’’ అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments