Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తమ కార్యకలాపాలు ప్రారంభించి 25 ఏళ్లు పూర్తి చేసుకున్న హిందుస్తాన్‌ కోకా-కోలా

తమ కార్యకలాపాలు ప్రారంభించి 25 ఏళ్లు పూర్తి చేసుకున్న హిందుస్తాన్‌ కోకా-కోలా
, మంగళవారం, 15 ఫిబ్రవరి 2022 (23:41 IST)
భారతదేశంలో అగ్రశ్రేణి ఎఫ్‌ఎంసీజీ కంపెనీలలో ఒకటైన హిందుస్తాన్‌ కోకా-కోలా బేవరేజస్‌ (హెచ్‌సీసీబీ) , భారతదేశంలో తమ కార్యకలాపాలను ప్రారంభించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, మహమ్మారి పరిస్దితులను దృష్టిలో పెట్టుకుని నేడు వర్ట్యువల్‌గా ఓ కార్యక్రమం నిర్వహించింది. గౌరవనీయ తెలంగాణా రాష్ట్ర పురపాలక పరిపాలన, నగరాభివృద్ధి, పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్‌ శాఖామాత్యులు శ్రీ కెటీ రామారావు ప్రత్యేకంగా కంపెనీ, దాని సరఫరాదారులు, భాగస్వాములు, పంపిణీదారులు, రిటైలర్లు, ఉద్యోగులకు తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం తరపున అభినందనలు తెలియజేశారు. హైదరాబాద్‌ సమీపంలోని అమీన్‌పూర్‌ వద్ద హెచ్‌సీసీబీ మెగా ఫ్యాక్టరీ ఉంది. ఈ ఫ్యాక్టరీలో  1998 నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. హెచ్‌సీసీబీకి అతి పెద్ద మార్కెట్‌లలో తెలంగాణా కూడా ఒకటి.

 
ఈ 25వ వార్షికోత్సవ వేడుకలను పురస్కరించుకుని కంపెనీ నిర్వహించిన వర్ట్యువల్‌ కార్యక్రమంలో సంస్థ ఉద్యోగులు, భాగస్వాములు, సరఫరా దారులు తో పాటుగా కోకా కోలా కంపెనీ  బాట్లింగ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ గ్రూప్‌ అధ్యక్షులు మార్సెలో బోఫీ; కోకా-కోలా ఇండియా, సౌత్‌ వెస్ట్‌ ఆసియా ఆపరేటింగ్‌ యూనిట్‌ అధ్యక్షులు సంకేత్‌ రాయ్‌; హెచ్‌సీసీబీ ఛైర్మన్‌ అండ్‌ సీఈవో నీరజ్‌ గార్గ్‌ పాల్గొన్నారు.

 
కంపెనీని అభినందిస్తూ పంపిన సందేశంలో శ్రీ కె టీ రామారావు మాట్లాడుతూ ‘‘తెలంగాణా రాష్ట్రంలో మీ ఉనికి మరియు మీ కార్యకలాపాలను మేము గౌరవిస్తున్నాము. దేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న రాష్ట్రాలలో తెలంగాణా ఒకటి.  పరిశ్రమలకు సంబంధించి అత్యంత అనుకూలమైన విధానాలను మేము తీసుకున్నాము.  సస్టెయినబల్‌  పద్ధతిలో పరిశమ్ర వృద్ధి మరియు అభివృద్ధి జరుగాలని మేము ఆకాంక్షిస్తున్నాము. తద్వారా రాష్ట్రంలో  ప్రజలు కూడా అభివృద్ధి చెందగలరు. ప్రపంచంలో అతిపెద్ద, అత్యంత ప్రాచుర్యం పొందిన కంపెనీలకు తెలంగాణా నిలయం. దీనికి మా విధానాలే కీలకం.

 
మీరంతా కూడా మా రాష్ట్ర రాయబారులుగానే మేము భావిస్తున్నాము. అదే సమయంలో హెచ్‌సీసీబీ ఇప్పుడు తెలంగాణా రాష్ట్రంలో మరింతగా పెట్టుబడులు పెట్టాలని కోరుకుంటున్నాము. అంతేకాదు, ఇతర సంస్థలు కూడా రాష్ట్రంలో తమ పరిశ్రమలను ప్రారంభించడం ద్వారా ఉనికి చాటాలని కోరుకుంటున్నాము. మీ 25వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 25 లక్షల మొక్కలను నాటాలని మీరు చేపట్టిన కార్యక్రమాన్ని సైతం నేను  అభినందిస్తున్నాను.  

 
ఆహ్లాదకరమైన వాతావరణం మరియు పచ్చదనంతో కూడిన పర్యావరణ వ్యవస్థ ఇప్పుడు అత్యవసరం. అందుకు ఈ తరహా సందర్భాన్ని మించనదేదీ ఉండదు. అమీన్‌పూర్‌ మున్సిపాలిటీతో భాగస్వామ్యం చేసుకుని  ఈ ప్రాంతంలో ఘన వ్యర్థాల నిర్వహణ వ్యవస్ధను ఏర్పాటుచేయనున్నారని తెలిసి సంతోషంగా ఉంది. మీ 25వ వార్షికోత్సవ వేడుక సందర్భంగా చేస్తోన్న ఆ కార్యక్రమాన్ని నేను అభినందిస్తున్నాను. మీ అందరికీ నా శుభాకాంక్షలు మరియు ఈ మొత్తం బృందాన్ని నేను అభినందిస్తున్నాను’’ అని అన్నారు.

 
తెలంగాణా రాష్ట్ర  ప్రభుత్వం తరపున అభినందన సందేశం పంపినీ శ్రీ  కె టీ రామారావుకు ధన్యవాదములు తెలిపిన  ఛైర్మన్‌ అండ్‌ సీఈవో, హెచ్‌సీసీబీ, నీరజ్‌ గార్గ్‌ మాట్లాడుతూ, ‘‘ఈ తరహా భారీ స్ధాయి పరిమాణం కలిగిన కంపెనీని నిర్మించడంలో ఎంతోమంది ఒకే దరికి రావడంతో పాటుగా తమ వంతు తోడ్పాటునందించారు. అందువల్ల హెచ్‌సీసీబీని స్పృశించడంతో పాటుగా దీనికి ఓ ఆకృతిని అందించిన ప్రతి ఒక్కరికీ నేను ధన్యవాదమలు తెలుపుతున్నాను. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాకు లభించిన సహకారం మరియు ప్రోత్సాహానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మరియు అదనపు పెట్టుబడులు పెట్టడానికి కట్టుబడి ఉన్నాము. తద్వారా రాష్ట్రంలో  ప్రజల అభివృద్ధికి తోడ్పడనున్నాము. గౌరవనీయ మంత్రివర్యులు సమయం తీసుకుని హెచ్‌సీసీబీ యొక్క 25వ వార్షికోత్సవ వేడుకలో భాగమైనందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదములు తెలుపుతున్నాము’’అని అన్నారు.

 
హెచ్‌సీసీబీని 14 ఫిబ్రవరి 1997లో భారతదేశానికి శీతలపానీయాలను 21వ శతాబ్దంలో అందించాలనే ఓ అతి చిన్న లక్ష్యంతో ప్రారంభించాము. అప్పటి నుంచి హెచ్‌సీసీబీ ఎంతో దూరం ప్రయాణించింది. దాదాపు 25 లక్షల మంది రిటైలర్లు, 3500 మంది డిస్ట్రిబ్యూటర్లు, 6500 మంది ఉద్యోగులను కలిగి ఉంది. దాదాపు 250000 మంది రైతులు హెచ్‌సీసీబీ తమ ఉత్పత్తుల కోసం వినియోగిస్తున్న ఉత్పత్తులను ఉత్పత్తి చేస్తున్నారు. ఈ కంపెనీ ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంది. దీని కార్యకలాపాలు 22 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలు, దక్షిణ, పశ్చిమ, తూర్పు భారతదేశంలో 376 జిల్లాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తుంది. భారతదేశ వ్యాప్తంగా ఉన్న తమ 15 ఫ్యాక్టరీలలో ఇది 60కు పైగా విభిన్న ఉత్పత్తులను 200 విభిన్న పరిమాణాలలో 7 విభాగాలలో  తయారుచేసి విక్రయిస్తుంది. దీని ఉత్పత్తులలో భారతదేశంలో ఎక్కువ మంది అభిమానించే శీతల పానీయాలైనటువంటి మినిట్‌ మెయిడ్‌,  మజా, స్మార్ట్‌వాటర్‌, కిన్లే, థమ్సప్‌, స్ర్పైట్‌, కోకా-కోలా, లిమ్కా,ఫాంటా, జార్జియా శ్రేణి టీ మరియు కాఫీ మొదలైనవి ఉన్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆమె అనవసరంగా తన భర్తను హత్య చేసింది, ప్రియుడు వాంగ్మూలం