Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పర్యాటక ఆధారిత భారతదేశం కోసం ఫెయిత్‌ అసోసియేషన్స్‌ విజన్‌ 2035 విడుదల

Advertiesment
పర్యాటక ఆధారిత భారతదేశం కోసం ఫెయిత్‌ అసోసియేషన్స్‌ విజన్‌ 2035 విడుదల
, గురువారం, 17 ఫిబ్రవరి 2022 (19:58 IST)
భారతదేశంలోని పర్యాటకం, ప్రయాణం, ఆతిథ్య రంగ సంస్థలతో కూడిన జాతీయ అసోసియేషన్‌ల ఉమ్మడి సంస్థ ఫెయిత్‌, ఆజాదీ కా అమృతోత్సవ్‌లో భాగంగా నేడు ఇండియా టూరిజం విజన్‌ 2035ను విడుదల చేసింది. వర్ట్యువల్‌గా జరిగిన ఈ సమావేశంలో పలు అసోసియేషన్‌ల ప్రతినిధులు పాల్గొన్నారు.
 


ఈ సందర్భంగా ఫెయిత్‌ ఛైర్మన్‌ నకుల్‌ ఆనంద్‌ మాట్లాడుతూ, భారతీయ పర్యాటకాన్ని అత్యంత ఆకర్షణీయంగా మలిచే లక్ష్యంతో ఈ విజన్‌ 2035ను విడుదల చేశామన్నారు. ఈ లక్ష్యాలను చేరుకోవడానికి నాలుగు వ్యూహాత్మక మూల స్తంభాలను ప్రతిపాదించమన్నారు. జాతీయ పర్యాటక విధానం, పెట్టుబడి మార్గాలు, మార్కెటింగ్‌, విలువను వృద్ధి చేసే నియంత్రణలతోనే లక్ష్య సాధన జరుగుతుందంటూ 150 బిలియన్‌ డాలర్ల విదేశీ మారక ద్రవ్యం సాధించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్లనున్నామన్నారు. దీనిలో భాగంగా పలు రాష్ట్రాలలో 200 సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌లను ఏర్పాటుచేయనున్నామన్నారు.

 
ఏడీటీఓఐ (డొమెస్టిక్‌ టూరిజం) అధ్యక్షుడు పీపీ ఖన్నా మాట్లాడుతూ, ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా దేశీయ టూరిజం పరంగా అగ్రగామి రెండవ దేశంగా ఇండియా ఖ్యాతి గడించింది. దాదాపు 2.3 బిలియన్‌ సందర్శనలు ఇక్కడ జరుగుతున్నాయన్నారు. జీఎస్‌టీ నమోదిత టూర్‌ ఆపరేటర్ల వద్ద 1.5 లక్షల రూపాయల వరకూ ఖర్చు చేసే భారతీయులకు రాయితీలనందిస్తే ఈ ఆదాయం మరింతగా పెరిగే అవకాశాలున్నాయన్నారు.

 
ఫెయిత్‌ వైస్‌ ఛైర్మన్‌ తేజ్బీర్‌ సింగ్‌ మాట్లాడుతూ మనకున్న సహజ, సాంస్కృతి పర్యాటక వనరుల పరంగా వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌ 9వ ర్యాంకును భారతదేశానికి కట్టబెట్టింది. మనకున్న వైవిధ్యమైన వాతావరణం కేవలం 17 దేశాలకు మాత్రమే ఉంది. అయినప్పటికీ పర్యాటక పరంగా మన దేశం నామమాత్రపు వాటాను మాత్రమే కలిగి ఉంది. మెరుగైన అభివృద్ధి ప్రణాళికలను అనుసరించడం ద్వారా పర్యాటకం మెరుగుపరుచుకోవాల్సి ఉందన్నారు.

 
ఫెడరేషన్‌ ఆఫ్‌ హోటల్స్‌ అండ్‌ రెస్టారెంట్స్‌ ఇండస్ట్రీ ఆఫ్‌ ఇండియాకు చెందిన గరీష్‌ ఒబెరాయ్‌ మాట్లాడుతూ, భారతదేశంలో 70వేల హోటల్స్‌, ఐదు లక్షల రెస్టారెంట్లు ఉన్నాయి. భారతదేశాన్ని ఆతిథ్య, క్యుసిన్‌ క్యాపిటల్‌గా మార్చాలన్నది లక్ష్యమన్నారు. ప్రపంచంలోనే అత్యధిక జీఎస్‌టీ రేట్లు ఇండియాలోనే ఉన్నాయంటూ ఆ ధరలను తగ్గించాలని కోరారు.
 
ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ టూర్‌ ఆపరేటర్స్‌ అధ్యక్షుడు రాజీవ్‌ మెహ్రా మాట్లాడుతూ నేడు విడుదల చేస్తోన్న విజన్‌తో ఇండియా గ్లోబల్‌ చాంఫియన్‌గా నిలువనుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తలకిందులుగా జపం చేసినా బాబును సీఎంను చేయలేరు : కొడాలి నాని