Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడ నుంచి దుబాయ్‌కు డైరెక్ట్ ఫ్లైట్ సర్వీస్

Webdunia
ఆదివారం, 2 అక్టోబరు 2022 (16:10 IST)
ఆంధ్రప్రదేశ్ వాణిజ్య రాజధానిగా పేరుగడించిన విజయవాడ, గన్నవరం విమానాశ్రయం నుంచి పలు విదేశాలకు విమాన సర్వీసులు నడుపుతున్నారు. వీటిలో కొన్ని డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసులు ఉండగా, మరికొన్ని లింకు ఫ్లైట్ సర్వీసులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా విజయవాడ నుంచి దుబాయ్‌కు డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసును నడుపనున్నారు. ఈ సర్వీను ఈ నెల 29వ తేదీ నుంచి ప్రారంభించనున్నారు. ఈ విమానం వారంలో రెండుసార్లు నడుపుతారు. ఈ మేరకు ఎయిర్ పోర్ట్ అడ్వైజరీ కమిటీ భేటీలో నిర్ణయించారు. 
 
అలాగే, ఢిల్లీ నుంచి అదనంగా మరో విమాన సర్వీసును విజయవాడ నుంచి నడుపాలని నిర్ణయించారు. ఈ మేరకు శనివారం జరిగిన భేటీలో పాల్గొన్న అధికారి ఒకరు ఈ విషయాన్ని వెల్లడించారు. అంటే విజయవాడ నుంచి వారంలో రెండు విమాన సర్వీసులు గన్నవరం నుంచి అందుబాటులో ఉంటాయి. 
 
విజయవాడ నుంచి ముంబైకి, విజయవాడ నుంచి వారణాసికి విమాన సర్వీసులు ఇప్పటికే నడుస్తుండగా, వీటిని తిరిగి సమీక్షిస్తామన్నారు. త్వరలో ఢిల్లీకి మరో విమాన సర్వీసు కూడా నడిపించాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ సమావేశంలో విమానాశ్రయ అభివృద్ధి పనులను సైతం సమీక్షించారు. 

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments