Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెట్రోల్ ధరలే కాదు.. సీఎన్‌జీ, పీఎన్‌జీ రేట్లు కూడా పెరిగాయ్

Webdunia
బుధవారం, 13 అక్టోబరు 2021 (13:07 IST)
CNG
దసరా పండుగ సీజన్‌లో గ్యాస్‌కు ఏర్పడిన డిమాండ్‌ను ప్రైవేటు కంపెనీలు క్యాష్ చేసుకుంటున్నాయి. పది రోజుల వ్యవధిలోనే రెండోసారి గృహ, రవాణాకు వాడే గ్యాస్ ధరలను పెంచేశాయి. దేశ రాజధాని ఢిల్లీ, చుట్టుపక్కల నగరాల్లో వాహనాల్లో నింపే సీఎన్‌జీ ధరతోపాటు పైపుల ద్వారా గృహాలకు చేరే గ్యాస్ పీఎన్‌జీ రేటు భారం ఇంకొంత పెరిగింది. గ్యాస్ డిస్ట్రిబ్యూషన్‌లో అగ్రగామిగా ఉంటూ, దేశ రాజధాని ఢిల్లీ, చుట్టుపక్కల మెట్రోల్లో మెజార్టీ వాటాదారైన ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ ఈ మేరకు కీలక ప్రకటన చేసింది..
 
దేశ రాజధాని ఢిల్లీతోపాటు పలు నగరాల్లో సీఎన్‌జీ, పీఎన్‌జీ ధరలు పెంచామని, బుధవారం (అక్టోబర్ 13) ఉదయం నుంచి పెరిగిన ధరలు అమల్లోకి వస్తాయని ఐజీఎల్ తెలిపింది. సీఎన్‌జీపై ఒక కిలోకు రూ .2.28 , సీఎన్‌జీపై క్యూబిక్ మీటరుకు రూ.2.10 పెంచారు.
 
సవరణ తర్వాత ఢిల్లీలో సీఎన్‌జీ గ్యాస్ ధర కిలోకు 49.76లు ఉంది. నోయిడాలో కిలో రూ.56.02, గురుగ్రామ్‌లో రూ.58.20, రేవారి రూ.58.90, కైతల్ రూ.57.10, ముజఫర్‌నగర్, మీరట్, షామ్లీ రూ.63.28, ఫతేపూర్, హమీర్‌పూర్ రూ.66.54, అజ్మీర్, పాలి, రాజసమంద్ కిలోకు రూ. 65.02గా ఉంది. పైప్ లైన్ ద్వారా సరఫరా చేసే గ్యాస్ సీఎన్‌జీ ధరను క్యూబిక్ మీటరుపై రూ.2.10 పెరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Lakshmi Manchu: కళను రాజకీయం చేయవద్దు... మంచు లక్ష్మీ కామెంట్స్

హోంబలే ఫిల్మ్స్ ఏడు ఎపిక్ ఫిలిమ్స్‌ లో తొలిగా నరసింహ సాంగ్ రిలీజ్

రైతు పోరాటం, మాదకద్రవ్యాల నేపథ్యంతో వీడే మన వారసుడు చిత్రం

Varsha bollamma: కానిస్టేబుల్ కనకం కథ కాపీ కొట్టడంపై కోర్టులో కేసు

Bhagyashri Borse: అక్కినేని అఖిల్ లెనిన్ సినిమా.. శ్రీలీల అవుట్.. భాగ్యశ్రీ బోర్సే ఇన్.. నిజమేనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments