Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇకపై క్యూఆర్ కోడ్‌తో కొత్త పాన్ కార్డుల జారీ..

ఠాగూర్
మంగళవారం, 26 నవంబరు 2024 (09:04 IST)
శాశ్వత ఖాతా సంఖ్య (పాన్ కార్డు)ను ప్రభుత్వ ఏజెన్సీలకు చెందిన అన్ని డిజిటల్ వ్యవస్థల్లో సామాన్య, వ్యాపార గుర్తింపుగా చేయడం కోసం రూ.1435 కోట్లతో పాన్ 2.0 ప్రాజెక్టును ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఆర్థిక వ్యవహారాలపై ఏర్పాటైన మంత్రివర్గం ఈ ప్రాజెక్టుకు ఆమోదముద్రవేసిందని కేంద్ర సమాచారం, ప్రసారాల శాఖామంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. పన్ను చెల్లింపుదార్ల రిజిస్ట్రేషన్ సేవలను సాంకేతికంగా మార్పు చేయడంతో పాటు సులువుగా వేగంగా, మెరుగైన నాణ్యతతో సేవలదించడానిక వీలవుతుందని భావిస్తున్నారు. కొత్త కార్డులను క్యూఆర్ కోర్డు‌తో జారీచేస్తారు. 
 
అలాగే, దేశవ్యాప్తంగా కోటి మంది రైతులు ప్రకృతి వ్యవస్థ సాయం చేసేలా ప్రోత్సహించేందుకుగాను రూ.2,481 కోట్ల విలువైన జాతీయ మిషన్ (ఎన్ఎంఎన్ఎఫ్)కు కూడా ఆమోదం తెలిపింది. స్టార్టప్లకు ఊతమిచ్చేందుకు ప్రారంభించిన అటల్ ఇన్నోవేషన్ మిషన్ (ఎయిమ్)ను 2028 మార్చి 31 దాకా పొడిగిస్తూ రూ.2750 కోట్లతో ప్రతిపాదించిన 'ఎయిమ్ 2.0'కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 'వన్ నేషన్ వన్ సబ్‌స్క్రిప్షన్ పథకానికి ఆమోద ముద్ర వేసింది. క్యాబినెట్ భేటీ అనంతరం కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో ఈ విషయాలను వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమాజంలోని సంఘటనల నేపథ్యంగా యముడు చిత్రం తీశాం : దర్శకుడు

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments