Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

2025-26 విద్యా సంవత్సరానికి దరఖాస్తులను ఆహ్వానించిన శివ్ నాడర్ యూనివర్శిటీ, ఢిల్లీ-ఎన్ సిఆర్

Shiv Nadar University

ఐవీఆర్

, సోమవారం, 25 నవంబరు 2024 (21:47 IST)
షివ్ నాడర్ యూనివర్శిటీ, ఢిల్లీ-ఎన్.సి.ఆర్, ప్రముఖ బహుళ విభాగాలు, పరిశోధనా-కేంద్రీయ సంస్థ, 2025-26 విద్యా సంవత్సరం కోసం ప్రవేశాలను తెరిచింది. ఇంజనీరింగ్, నేచురల్ సైన్సెస్, మేనేజ్మెంట్, ఎంటర్ ప్రెన్యుర్ షిప్, హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్ నాలుగు స్కూల్స్ లో ప్రోగ్రాంస్ కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. కాబోయే అభ్యర్థులు యూనివర్శిటీ అధికారిక వెబ్ సైట్ snu.edu.in ద్వారా దరఖాస్తు చేయవచ్చు.
 
2025-26 కోసం, యూనివర్శిటీ విద్యా శ్రేష్టతను మద్దతు చేసి, బహుకరించడానికి ఉపకారవేతనాల శ్రేణిని అందించడం కొనసాగిస్తోంది. సంస్థ అందచేసే ఆఫరింగ్స్‌లో కంప్యూటర్ సైన్స్, బిజినెస్ డేటా అనలిటిక్స్‌లో ద్వంద్వ డిగ్రీ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాంస్ ఇవి కొత్త చేరిక. అరిజోనా రాష్ట్ర యూనివర్శిటీ, యుఎస్ఏ సహకారంతో ఇవి ప్రారంభించబడ్డాయి. ఈ ప్రోగ్రాంస్ విద్య- పరిశ్రమ యొక్క అభివృద్ధి చెందుతున్న డిమాండ్లను పరిష్కరించడానికి రూపొందించబడ్డాయి. ఉపకారవేతనాల గురించి వివరాలు ఈ వెబ్ సైట్ లింక్‌లో లభిస్తున్నాయి.
 
ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్‌గా గుర్తించబడిన, షివ్ నాడర్ యూనివర్శిటీ విద్య కోసం సమగ్రమైన, విద్యార్థి-కేంద్రీకృత విధానంతో దృఢమైన పరిశోధనా అవకాశాలను మిశ్రమం చేస్తోంది. విద్యార్థులకు కీలకంగా ఆలోచించగలగడం, సృజనాత్మకత, నాయకత్వ నైపుణ్యాలను కలగచేయడానికి, వేగంగా వృద్ధి చెందుతున్న అంతర్జాతీయ పరిస్థితి యొక్క డిమాండ్లకు అనుగుణంగా వారు సిద్ధంగా ఉండటాన్ని నిర్థారించడానికి యూనివర్శిటీ యొక్క విభిన్నమైన పోర్ట్ ఫోలియో ప్రోగ్రాంస్ రూపొందించబడ్డాయి. 
 
“కొత్త విద్యా సంవత్సరానికి ప్రవేశాలు ప్రారంభమవడంతో, తాము ఎంచుకున్న రంగాల్లో శ్రేష్టతను సాధించడానికి ఆతృతగా ఉన్న అభిరుచి గల  వ్యక్తులను షివ్ నాడర్ యూనివర్శిటీ, ఢిల్లీ-ఎన్ సిఆర్ లో మేము సాదరంగా ఆహ్వానిస్తున్నాము. మా సంస్థ అకాడమిక్స్ ను మించి అందచేస్తోంది, సృజనాత్మకత, విశ్లేషణాత్మకమైన ఆలోచనలు, వ్యక్తిగత మరియు వృత్తిపరమైన వృద్ధికి సమతుల్యమైన విధానాన్ని  పోషిస్తోంది,” అని ప్రొఫెసర్ అనన్య ముఖర్జీ, వైస్-ఛాన్స్ లర్, షివ్ నాడర్ యూనివర్శిటీ, ఢిల్లీ-ఎన్ సిఆర్ అన్నారు.
 
యూనివర్శిటీ అత్యంత విజయవంతమైన కెరీర్ డవలప్మెంట్ సెంటర్ (సిడిసి)ని కలిగి ఉంది, ప్రపంచవ్యాప్తంగా ఇది ప్రముఖ సంస్థలతో ప్లేస్మెంట్స్ మరియు ఇంటర్న్ షిప్స్ ను అందచేస్తుంది. షివ్ నాడర్ యూనివర్శిటీ నుండి గ్రాడ్యుయేట్ చేసిన వారిని రంగాల్లోని ప్రముఖ కంపెనీలు నియామకం చేస్తున్నాయి, చాలామంది విద్యార్థులు తమ అండర్ గ్రాడ్యుయేట్ అధ్యయనాలు తరువాత నేరుగా పిహెచ్.డి. ప్రోగ్రాంస్ లోకి నేరుగా ప్రవేశాలు పొందడం సహా ఉన్నత విద్య కోసం అంతర్జాతీయంగా ప్రతిష్టాత్మకమైన సంస్థలలో ప్రవేశాలు పొందుతున్నారు. ఇది యూనివర్శిటీ యొక్క నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ పరిశోధనా డిగ్రీ యొక్క విలువను, మరియు అంతర్జాతీయంగా పోటీయుత ప్రతిభను పోషించడానికి యూనివర్శిటీ యొక్క సామర్థ్యాన్ని ప్రదర్శిస్తోంది. గత ఏడాది, యూనివర్శిటీకి చెందిన గ్రాడ్యుయేట్స్ ను భారతదేశం, విదేశాల్లోని ప్రముఖ సంస్థలు నియామకం చేసాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇండియా బైక్ వీక్: రైడ్, పార్టీ, రేస్ బెస్ట్ వీకెండ్