Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇండియా బైక్ వీక్: రైడ్, పార్టీ, రేస్ బెస్ట్ వీకెండ్

bike race

ఐవీఆర్

, సోమవారం, 25 నవంబరు 2024 (21:26 IST)
గల్ఫ్ సింట్రాక్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఇండియా బైక్ వీక్‌కు రంగం సిద్ధమైంది. 11వ సారి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ ఈవెంట్లో సరికొత్త అనుభవాలు ప్రతీ ఒక్కరికి అందించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇందుకోసం ఒక్కరినీ స్వాగతిస్తున్నాము, ఆహ్వానిస్తున్నాము. ఎందుకంటే... ఇక్కడ "అందరూ ఒక్కటే."
 
రేసింగ్:
ఈ సీజన్‌లో, "నెక్స్ట్ చాప్టర్" యొక్క ఫీచర్‌గా, మేము రెండు FMSCI అనుబంధ రేసులతో గ్రాస్‌రూట్ రేసింగ్‌ను ప్రోత్సహించేందుకు సిద్ధమయ్యాము. IBW హిల్ క్లైంబ్‌ను రీస్ మోటో అందిస్తే... ఫ్లాట్ ట్రాక్ రేస్‌ను హార్లే-డేవిడ్‌సన్‌తో సంయుక్తంగా అందించారు. FMSCI రేసింగ్ లైసెన్స్‌‌తో సహా ఫ్లాట్ ట్రాక్‌కు రూ. 1,250, హిల్ క్లైంబ్ కోసం రూ. 1,000గా నిర్ణయిచారు. పోటీదారులందరూ రేసు కోసం ఈ మొత్తాన్ని కట్టి తమ పేర్లని నమోదు చేసుకోవాలి. అన్ని రేసుల నుండి మొత్తం ప్రైజ్ మనీని రూ. 12 లక్షలుగా నిర్ణయించారు. ఫ్లాట్ ట్రాక్ కోసం రిజిస్ట్రేషన్ ప్రస్తుతం లైవ్‌లో ఉంది. మొత్తం 81 రిజిస్ట్రేషన్‌లు పూర్తయిన తర్వాత రిజిస్ట్రేషన్ ప్రక్రియ క్లోజ్ అవుతుంది. అంతేకాకుండా... ఈ ఈవెంట్లో 2 రేస్ ట్రాక్‌లు ఉంటాయి. గల్ఫ్ సింట్రాక్‌టివ్రా యాక్షన్ గేమ్‌లు, రీస్ మోటో అందించిన IBW డర్ట్ డాష్ అందుబాటులో ఉంటాయి. 
 
సరికొత్త లాంచ్ లు మరియు పర్ ఫార్మెన్స్
IBW అనేది బ్రాండ్‌లు తమ తాజా ఉత్పత్తులను, కమ్యూనిటీకి తమ కార్యకలాపాలను, ఉత్పత్తులను పరిచయం చేసే అద్భుతమైన వేదిక. మోటార్‌ సైకిళ్లు, ఉపకరణాలు, రేసింగ్ సిరీస్ నుండి TV షోల వరకు అన్నీ ఇక్కడ పోటీదారుల కోసం సిద్ధంగా ఉంటాయి. Hero MotoCorp, KTM, Brixton, Nexx, Reise వంటి బ్రాండ్‌లు ఫెస్టివల్‌లో కొన్ని ఉత్తేజకరమైన ఆవిష్కరణలు/లాంచ్‌లను కలిగి ఉంటాయి. NXS స్టేజ్‌లో పాల్గొనే ప్రఖ్యాత రాపర్ డివైన్, హిప్-హాప్ ఆర్టిస్ట్ బ్రోధా వి, ఇండీ మ్యూజిక్ ఆర్టిస్ట్ OAFF లాంటి ప్రముఖుల అద్భుతమైన ప్రదర్శనలు ఈ ఈవెంట్ లో ఉంటాయి. మొదటిసారిగా డబుల్ జంప్ షో కేస్ కోసం అంతర్జాతీయ FMX అథ్లెట్లచే గల్ఫ్ సింట్రాక్ మోటో మేహెమ్ FMX షో కూడా ఉంటుంది.
 
వారసత్వం
మేము మా పార్ట్ నర్ జేమ్సన్‌తో మా అనుబంధాన్ని దశాబ్దం పూర్తి చేసుకున్న ఇండియా బైక్ వీక్ కమ్యూనిటీకి చెందిన ప్రముఖుల నుండి అనుభవాలను పంచుకుంటున్నాము. IBW 2024లో క్లబ్‌లు మరియు రైడింగ్ గ్రూపులు ముందుకు వచ్చి తమ ప్రత్యేక కథనాలను చెప్పాలని ఈ ఈవెంట్ పిలుపునిస్తోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని బొంబాయి కస్టమ్ వర్క్స్ రూపొందించిన హార్లే-డేవిడ్‌సన్ స్ట్రీట్ బాబ్ కస్టమ్ మోటార్‌సైకిల్‌ను.. ఎవరైతే అద్భుతమైన తమ అనుభవాన్ని, స్టోరీని చెప్తారో వారికి బహుమతిగా అందించబడుతుంది.  
 
IBW 2024 యొక్క ఇతక కీలక వివరాలు:
బిగ్ ట్రిప్ టెంట్:
ఇంటర్నేషనల్ & ఇండియన్ ఓవర్‌ల్యాండింగ్ మరియు అడ్వెంచర్ ట్రావెల్ లెగసీని కలిగి ఉన్న వ్యక్తులు హోస్ట్ చేసే సంభాషణలు ఇతర మోటార్‌సైకిల్ ఔత్సాహికులకు స్ఫూర్తినిస్తాయి. ఈ సంభాషణల్లో అగ్రగామిగా అంతర్జాతీయ ట్రయల్‌ బ్లేజర్ ఎల్‌స్పెత్ బార్డ్ (1982లో బిగ్ ట్రిప్ స్టేజ్‌లో బైక్‌పై ప్రపంచాన్ని చుట్టి వచ్చిన మొదటి బ్రిటీష్ మహిళ) పాల్గొంటారు. ఆమెతో పాటు మార్క్ ట్రావెల్స్ - బ్లాగర్ మరియు గ్లోబ్ ట్రాటర్ కూడా ఈ ఈవెంట్ లో ప్రధాన ఆకర్షణగా ఉండబోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అద్భుతమైన, ఎవ్వరికీ తెలియని విషయాల్ని ప్రపంచానికి చాటిచెప్పిన ఘతన మార్క్ ట్రావెల్స్ ది.
 
అంతేకాకుండా ఈ బిగ్ ట్రిప్‌లో మీనాక్షి దాస్ వంటి ప్రసిద్ధ భారతీయ రైడర్‌లు కూడా కన్పించబోతున్నారు, అందరికి ఉత్సాహాన్ని అందించబోతున్నారు. మీనాక్షి దాస్ తన బైక్‌పై 67 దేశాలను కవర్ చేస్తూ సరిహద్దులను దాటి అందరికి స్ఫూర్తి నింపారు. ఆమెతో పాటు సయ్యద్ ఒమర్ సిద్ధిక్, ఠాగూర్ చెర్రీ, మౌనా & శ్యామ్ (రక్‌సాక్ డైరీలు) వంటి ఇతర మోటార్‌సైకిలిస్టులు భారతదేశంలో పెరుగుతున్న రైడింగ్ & ఓవర్‌ల్యాండింగ్ సంస్కృతికి స్ఫూర్తిని ఈ ఈవెంట్  లో పంచుకుంటారు.
 
మరోక అశ్చర్యకరమైన విషయం ఏంటంటే... IBW 2024 బిగ్ ట్రిప్ ఎక్స్‌ పోటోను ఈ ఈవెంట్ కు జోడించింది. 2-వీల్ ఓవర్‌ ల్యాండింగ్ ఔత్సాహికులు వారి ప్రయాణ కలలను సాధించేందుకు వారికి సహాయం చేస్తుంది. ఎక్స్‌ పోలో ఓవర్‌ల్యాండ్ ట్రిప్ ఆర్గనైజర్స్ మరియు వెస్ట్రన్ ఇండియా ఆటోమొబైల్ అసోసియేషన్ భారతదేశం నుండి విదేశాలకు వెళ్లేందుకు కార్నెట్ డు పాసేజ్ మరియు డ్రైవింగ్ పర్మిట్‌లను పొందే ప్రక్రియను వివరిస్తాయి.
 
భద్రతా విధానం:
మరోవైపు హౌలింగ్ డాగ్ స్టేజ్ వద్ద జేమ్సన్ కనెక్ట్ ఒక ఉద్వేగభరితమైన ప్రసంగాన్ని అందించారు. ఇందులో రైడింగ్ లో ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వివరిస్తారు. వీరితోపాటు జాస్విన్ బోస్ ఒక సేఫ్టీ సెషన్ ను అందిస్తారు. ఈ సెషన్ లో ఆయన బాధ్యతాయుతమైన రైడింగ్‌ ఎలా చేయాలి, యాక్టివ్ మరియు పాసివ్ రోడ్ సేఫ్టీ, రైడింగ్ మ్యానరిజమ్‌ల గురించి వివరిస్తాడు. టేమ్ ది ట్రైల్స్ ద్వారా ఆఫ్-రోడింగ్ గురించి ప్రముఖ ఆఫ్ రోడ్ రైడర్ మరియు ట్రయల్స్ నిపుణుడు నిఖిల్ సూద్ ఆసక్తికరమైన సెషన్ కూడా ఉంటుంది. నిఖిల్... పూణే చుట్టూ తన 17+ సంవత్సరాల ట్రయల్-రైడింగ్ అనుభవాన్ని పంచుకుంటాడు. అంతేకాకుండా తోటి ఔత్సాహికుల కోసం చిట్కాలు, హక్స్ మరియు గైడెడ్ అందిస్తాడు.
 
కాలేజ్ స్థాయిలో రైడింగ్ పై ఆసక్తి కలిగిన వారికి ముందుగా భద్రతా గురించి తెలియచేస్తారు. IBWచే నిర్వహించబడే నిపుణుల బృందం గోవా మరియు పూణేలోని ముఖ్య కళాశాలలను సందర్శించి సురక్షితంగా రైడింగ్ ద్వారా విద్యను ప్రోత్సహించడానికి మరియు మా నిపుణుల సెషన్ల ద్వారా మోటార్‌సైక్లింగ్‌లో ప్రత్యామ్నాయ కెరీర్‌ల గురించి ఆలోచనలను అందజేస్తుంది.
 
ఈ సందర్భంగా బ్రీత్ మరియు కై పో చేలో తన పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు మరియు బైకర్ అమిత్ సాద్ మోటార్‌సైకిళ్లపై ప్రేమ మరియు దేశవ్యాప్తంగా తన రైడింగ్ అనుభవాల గురించి ప్రసంగించనున్నారు.. ఈయనతో పాటు పీకే, రాయూస్ లాంటి సినిమాల్లో నటించిన, అనిల్ చరణ్‌జీత్ (అనిల్ మాంగే అని కూడా పిలుస్తారు) మరాఠీ సినిమా నటుడు ఆనంద్ కాలేతో IBW ట్రైబ్ లో ఉన్నారు. వారు కొన్నాళ్లు నుంచి IBWలో కమ్యూనిటీతో సన్నిహితంగా ఉంటారు.
 
అతి పెద్ద ప్రదర్శనలు:
ANG వీల్స్, మరియు ఇర్షాద్ షేక్ వంటి ప్రముఖ మోటో కళాకారులు ఫెస్టివల్‌లో తమ అద్భుతమైన కళను ప్రదర్శిస్తారు. ఈ ఏడాది, కలెక్టర్స్ కార్నర్ ద్వారా మొదటిసారిగా జోయిపోస్టల్ మరియు విశాల్ అగర్వాల్, కొల్హాపూర్ వింటేజ్ బైక్స్ మరియు పూణే వింటేజ్ స్కూటర్స్ క్లబ్ ద్వారా అరుదైన సేకరణను ప్రదర్శిస్తారు. అంతేకాకుండా ఈ ఈవెంట్ లో మోటో-వ్లాగర్ మీట్ అప్‌లు కూడా ఉంటాయి. ఇందులో పాపులర్ VFX కళాకారుడు మరియు బైకర్ అనురాగ్ సల్గాంకర్, ఆయన అనుభవాల గురించి ఉత్తేజకరమైన కథనాలను అందిస్తారు. థ్రోటల్ ష్రాటిల్, ట్రిప్ మెషిన్ & సూపర్ ఛాయ్ వంటి బైకర్ కేఫ్‌లు IBW 2024లో మా కీలక భాగస్వాములుగా కొనసాగుతున్నాయి.
 
మాడ్ బైక్స్:
ఇక పోతే  తయారీదారుల నుండి ప్రత్యేక ప్రదర్శనలు కస్టమర్ మోడ్‌లను చూపుతాయి. Harley-Davidson కస్టమ్ కింగ్స్, HOG నుండి అనుకూలీకరించిన మోటార్‌సైకిళ్లను చూపుతుంది. Hero MotoCorp అద్భుతంగా అప్ డేట్ చేసిన Xpulse మోటార్‌సైకిళ్లను మరియు స్ఫూర్తిదాయకమైన ర్యాలీ రైడర్ కథనాలను ప్రదర్శించడానికి సిద్ధంగా ఉంది. ఈ వారం ప్రారంభించబడుతున్న "Xpulse Fanatics" అని పిలువబడే ఒక ఉత్తేజకరమైన ఆన్‌లైన్ పోటీ ద్వారా ఎంపిక చేయబడుతుంది.
 
Price Hike Alert:
ధరల పెంపు హెచ్చరిక:  వీకెండ్ పాస్ టికెట్ ధరని రూ. 3,499 మరియు నవంబర్ 23 నుండి ఒకే రోజు ఎంట్రీకి రూ. 2,699గా నిర్ణయించారు. ఏదైనా యాక్టివీటీ కోసం నమోదు చేసుకోవడానికి మరియు టిక్కెట్‌లను బుక్ చేసుకోవడానికి సందర్శించండి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆక్సిజన్ కొరత.. కవలపిల్లలు అంబులెన్స్‌లోనే చనిపోయారా?