Webdunia - Bharat's app for daily news and videos

Install App

54 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్న బీఎస్ఎన్ఎల్

Webdunia
బుధవారం, 3 ఏప్రియల్ 2019 (21:11 IST)
భారత ప్రభుత్వ టెలికాం రంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ బోర్డు 54 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. అంతేకాకుండా ఖర్చులను తగ్గించుకునే క్రమంలో రిటైర్మెంట్ వయస్సును 58 సంవత్సరాలకు తగ్గించింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన బోర్డు మొత్తం పది ప్రతిపాదనలను సూచించగా అందులో మూడింటికి బీఎస్‌ఎన్‌ఎల్ బోర్డు ఆమోదం తెలిపింది.
 
తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిన ఈ ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ తొలిసారి ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని స్థితికి దిగజారిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఉద్యోగులకు జీతాల కోసం ప్రత్యేకంగా రూ.5 వేల కోట్ల అప్పు కూడా చేయాల్సి వచ్చింది. దీంతోపాటు ప్రభుత్వ ప్రాజెక్టుల నుంచి రావాల్సిన రూ.2900 కోట్లు చెల్లించడంతో పాటు ప్రభుత్వం మరో రూ.3500 కోట్ల రుణం కూడా బీఎస్‌ఎన్‌ఎల్‌కు ఇచ్చింది. 
 
ఈ డబ్బుతో మరో మూడు, నాలుగు నెలల వరకు బీఎస్‌ఎన్‌ఎల్ తన కార్యకలాపాలను కొనసాగించే వీలు కలిగింది. ప్రస్తుతం ఈ టెలికాం సంస్థలో మొత్తం 1.76 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరిలో ఎవరి ఉద్యోగం ఉంటుందో లేక ఊడుతుందోనని ఉద్యోగులు కంగారుపడుతున్నారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments