ఇండియన్ ప్రీమియర్ లీగ్ 12వ దశ పోటీలు శనివారం నుంచి ప్రారంభమయ్యాయి. చెన్నై వేదికగా ప్రారంభమైన ఈ సీజన్ తొలి మ్యాచ్‌లో బెంగుళూరు రాయల్ ఛాలెంజర్ జట్టుతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తలపడింది. ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజయభేరీ మోగించింది.
అయితే, సీఎస్కే జట్టు బ్యాట్స్‌మెన్ సురేష్ రైనా చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‍లో ఐదు వేల పరుగులు సాధించిన తొలి క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. శనివారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో జరిగిన ప్రారంభ మ్యాచ్‌లో 19 పరుగులు చేసిన రైనా.. 15 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఈ ఘనత సాధించాడు.
ఈ జాబితాలో 5004 పరుగులతో రైనా అగ్రస్థానంలో కొనసాగుతుండగా, ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 4954 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. రోహిత్ శర్మ (4493), గౌతం గంభీర్ (4217) పరుగులో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.