కరోనా కష్టకాలంలో బ్యాంకు పనివేళలు కుదింపు

Webdunia
శుక్రవారం, 23 ఏప్రియల్ 2021 (10:12 IST)
కరోనా వైరస్ మహమ్మారి తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో బ్యాంకు పనివేళల సమయం కుదించారు. ఈ కుదించిన పనివేళలు శుక్రవారం నుంచి వచ్చే నెల 15వ తేదీ వరకు అమల్లో వుండనున్నాయి. ఏపీలోని అన్నీ బ్యాంకులు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే పని చేస్తాయి. ఎస్ఎల్బీసీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కన్వీనర్ కె. బ్రహ్మానందరెడ్డి ఈ మేరకు వెల్లడించారు. 
 
కాగా, కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో రోజులో పని గంటలు, వారంలో పనిదినాలు తగ్గించాలని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్లు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. రాబోయే నాలుగు నుంచి ఆరు నెలల వరకు భౌతిక బ్యాంకింగ్‌ను పరిమితం చేయాలని, ఐదు రోజుల పని వారాన్ని అమల్లోకి తీసుకురావాలని ఫోరం డిమాండ్ చేస్తోంది. 
 
ఇంటి నుండి పని చేయడం, కనీస సిబ్బందితో బ్యాంకింగ్ వ్యవహారాలు రాబోయే నాలుగైదు నెలల్లో నిర్వహించాలని ఫోరం కోరుతోంది. అంతేకాదు, అన్ని బ్యాంక్ శాఖలను తెరవకుండా ఉండటం ద్వారా కస్టమర్లు, ఉద్యోగులు మహమ్మారికి గురికాకుండా హబ్ బ్యాంకింగ్ కాన్సెప్ట్ ప్రవేశపెట్టాలని ఫోరం సూచిస్తోంది. ఈ నేపథ్యంలో తక్షణ చర్యల్లో భాగంగా బ్యాంకు వేళలను కుదించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా తెలుగులో ప్రణవ్ మోహన్ లాల్.. డియాస్ ఇరాయ్

Samantha: స‌మంత‌ నిర్మాతగా మా ఇంటి బంగారం ప్రారంభ‌మైంది

JD Laxman: యువతరం ఏది చేసినా ప్యాషన్ తో చేయాలి : జే.డి. లక్ష్మీ నారాయణ

Chiru song: మన శంకరవరప్రసాద్ గారు ఫస్ట్ సింగిల్ 36 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్‌

Naga Shaurya : అందమైన ఫిగరు నువ్వా .. అంటూ టీజ్ చేస్తున్న బ్యాడ్ బాయ్ కార్తీక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

తర్వాతి కథనం
Show comments