Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీకి కొత్తగా రెండు ఓడరేవులు.. జల మార్గాల ద్వారా ఖర్చు తక్కువ

Webdunia
శుక్రవారం, 27 సెప్టెంబరు 2019 (15:49 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్తగా రెండు ఓడరేవులను ఏర్పాటు చేయాలని ఏపీ ఐటీ - పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి కేంద్ర ఓడరేవుల శాఖ మంత్రి మాన్ సుఖ్ మాండవియాను కోరారు.

భారతదేశంలో అత్యధిక సముద్ర తీరం ఉన్న రాష్ట్రంలో ఏపీ ఒకటి. ఏపీకి 972 కిలోమీటర్ల సుదీర్ఘమైన తీరరేఖ ఉంది. గుజరాత్ 1061 కిలోమీటర్ల తర్వాత దేశంలో ఎక్కువ తీర రేఖ ఉన్న రాష్ట్రాల్లో ఏపీ రెండో స్థానంలో ఉంది. అయితే సరుకు రవాణాకు ఓడల ద్వారా ఖర్చు తక్కువ అవుతోంది.
 
అదే విమాన రవాణా - రైల్ రవాణాతో ఖర్చు అధికంగా అవుతుంది. ఇంత పెద్ద సముద్ర తీరం ఉన్న ఏపీకి మరో రెండు మూడు ఓడరేవులు వస్తే పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని ఏపీ సర్కారు అభిప్రాయపడుతుంది. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రతిపాదనలతో కూడిన వినతి పత్రాన్ని కేంద్ర మంత్రికి గౌతంరెడ్డి అందజేశారు. 
 
దీంతో దుగరాజపట్నం పోర్టును జాతీయ పోర్టుగా చేయనందున-ప్రత్యామ్నాయంగా రామాయపట్నం - మచిలీపట్నం వంటి ప్రాంతాల్లో కొత్త ఓడరేవులను ఏర్పాటు చేయాలని మాండవియాకి గౌతం రెడ్డి విజ్ఞప్తి చేశారు.ఈ ప్రతిపాదన కార్యరూపం దాలిస్తే ఏపీ సముద్ర రవాణాలో మరింత ముందుకు దూసుకు వెళ్లడం ఖాయం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments