ఎస్పీబీకి అమూల్ గొప్ప నివాళి.. అమూల్ బేబీతో బాలు పాట

Webdunia
శనివారం, 26 సెప్టెంబరు 2020 (12:52 IST)
పాల ఉత్పత్తుల దిగ్గజం అమూల్ సంస్థ గానగంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం (74)కు గొప్ప నివాళి అర్పించింది. ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంతో కలిసి అమూల్ బేబీ పాట పాడుతున్నట్లుగా ఉన్న ఓ బ్లాక్ అండ్ వైట్ డూడుల్‌ను అమూల్ సంస్థ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అంతేకాదు, ఎస్పీబీ పాపులర్ పాటల్లో ఒకటైన 'తేరే మేరే బీచ్ మే కైసా తా యే బంధన్ అంజనా...' అన్న చరణాలను ఆ డూడుల్‌పై రాసింది.
 
సందర్భానుసారం సరైన కొటేషన్‌తో అమూల్ చేసిన ఈ పోస్టు చాలామందిని ఆకట్టుకుంటోంది. బాలుకు ఇది గొప్ప నివాళి అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియాలోనూ ఈ డూడుల్ వైరల్‌గా మారింది. 'తేరే మేరే బీచ్ మే' పాటను 1981లో కమల్ హాసన్ హిందీ చిత్రం ఏక్ దూజే కె లియే కోసం బాల సుబ్రహ్మణ్యం, లతా మంగేష్కర్ కలిసి పాడారు.
 
కాగా, గాన గంధర్వుడు బాల సుబ్రహ్మణ్యం(74) కరోనా బారిన పడి చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం (సెప్టెంబర్ 25) మధ్యాహ్నం ఒంటిగంటకు కన్నుమూసిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments