Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైల్వే ప్రయాణీకులకు చేదు వార్త.. దుప్పట్లు, బెడ్‌షీట్లు కావాలంటే?

Webdunia
మంగళవారం, 19 అక్టోబరు 2021 (22:02 IST)
రైల్వే ప్రయాణీకులకు చేదు వార్త. ఇకపై రైలులో దుప్పట్లు, బెడ్‌షీట్స్‌ కావాలంటే జేబులకు చిల్లు పెట్టుకోవాలసిందేనట. కోవిడ్‌‌కి ముందు రైల్వే శాఖ బెడ్‌ షీట్స్‌, దుప్పట్లు, దిండులను ఉచితంగానే ఇచ్చేది. అయితే కరోనా వైరస్‌ మొదటి వేవ్‌ ప్రారంభం నుంచి ఇవ్వడం నిలిపివేశారు. మహమ్మారి ఉదృతి తగ్గడంతో మళ్లీ ఆ సౌకర్యాన్ని షురూ చేసింది. 
 
అయితే ప్రస్తుతం ఢిల్లీతో సహా పలు రైల్వే డివిజన్ల రైళ్లలో డిస్పోజబుల్‌ బెడ్‌ షీట్లు, దుప్పట్లు వంటి అవసరమైన కిట్‌లను ప్రయాణీకులకు అందించేందుకు స్టేషన్లలో అల్ట్రా-వైలెట్‌ బేస్డ్‌ లగేజ్‌ శానిటైజేషన్‌ మెషిన్లను ప్రారంభించింది. ఇందుకోసం రైళ్లలో ప్రయాణించే ప్రతీ ప్రయాణీకుడు కనిష్టంగా రూ. 30 నుంచి గరిష్టంగా రూ. 300 వరకు చెల్లించాల్సి ఉంటుంది.
 
ప్రస్తుతం కోవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా 95 శాతం రైళ్లు నడుస్తు న్నాయి. కాగా, ప్రస్తుతం ఢిల్లీ రైల్వే డివిజన్‌లో 57 రైళ్లలో మాత్రమే ఈ సౌకర్యం అందుబాటులో ఉంది. కోవిడ్‌ పరిస్థితిని సమీక్షించిన తర్వాత మరిన్ని స్టేషన్లలో ప్రారంభిస్తారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments