Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జగన్ ఆలోచనలలో భాగంగానే విద్యార్ధులకు రోబోటిక్ టెక్నాలజీస్ లో సైతం శిక్షణ: సజ్జల

జగన్ ఆలోచనలలో భాగంగానే విద్యార్ధులకు రోబోటిక్ టెక్నాలజీస్ లో సైతం శిక్షణ:  సజ్జల
, శుక్రవారం, 8 అక్టోబరు 2021 (22:40 IST)
ప్రస్తుతం పోటీ ప్రపంచంలో జాతీయ,అంతర్జాతీయ స్ధాయిలో పోటీపడే స్ధాయిలో విద్యార్దులను తీర్చిదిద్దాలనే గొప్ప ఆలోచనతో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముందుకు వెళ్తున్నారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారులు (ప్రజావ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లిలో శుక్రవారం నాడు అప్లైడ్ రోబో కంట్రోల్ సర్టిఫికేషన్ ఆన్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ కోర్సును సజ్జల రామకృష్ణారెడ్డి లాంచ్ చేశారు.

ఈ సందర్భంగా కోర్సు లాంచ్ చేయడానికి  సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు. ఇండో యూరో సింక్ అండ్ జర్మన్ వర్సిటి సంస్ధ ఆఫర్ చేస్తున్న ఈ కోర్సులో రాష్ర్టవ్యాప్తంగా వివిధ ఇంజనీరింగ్ కాలేజీలలో ఇసిఇ, ట్రిపుల్ ఈ, మెకానికల్, కంప్యూటర్ సైన్స్ కోర్సులు చేస్తున్న2,400 విద్యార్ధులను ఎంపిక చేయడం జరుగుతుంది.ఏపి స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఇందుకోసం ఆ సంస్ధతో ఒప్పందం కుదుర్చుకుంది.

ఇండో యూరో సింక్ అండ్ జర్మన్ వర్సిటి అధ్యక్షులు రాజ్ వంగపండు,ఏపి స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ సలహాదారులు చల్లా మధుసూధన్ రెడ్డి,ఇండో యూరోస్ సింక్రనైజేషన్ సంస్ధ ఛీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ ఓంశ్రీ,ఆపరేషన్స్ మేనేజర్ హేమ పోస్టర్ విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు.

సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ గత రెండుి సంవత్సరాలుగా శ్రీ వైయస్ జగన్ గారు స్కిల్ డెవలప్ మెంట్ ను నేరుగా కరిక్యులమ్ లో పార్ట్ గా చేయడం జరిగిందన్నారు. విద్యార్దులు కేవలం డిగ్రి తీసుకోవడమే కాకుండా వారి భవిష్యత్తుకు బంగారు బాట వేసుకునేలా ప్రామిసింగ్ ఫ్యూచర్ దిశగా అడుగులు వేసేటట్లు ప్రభు్త్వం నిర్ణయం తీసుకుంది.దానిలో భాగంగా స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ను ఫోకస్డ్ గా అభివృధ్ది పరిచారు.

30 వరకు స్కిల్ డెవలప్ మెంట్ కాలేజీలు,యూనివర్శిటిలను స్ధాపించే దిశగా నిర్ణయం తీసుకున్నారు. పనులు కూడా ప్రారంభం కాబోతున్నాయి.స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఇప్పటికే పలు పరిశ్రమలతో ఒప్పందం కుదుర్చుకుంది. విద్యార్దులు కాలేజీలనుంచి బయటకు వచ్చాక పరిశ్రమల దగ్గరకు చేరేవరకు ఉన్న గ్యాప్ ను పూర్తి చేసేలా వారి నీడ్స్ కు తగినట్లుగా తీర్చిదిద్దేలా చేస్తున్నారు. శ్రీ సిటీలో ఓరియెంటేషన్ కోర్సులు ఇస్తున్నారు.

మంచి అనుభవం వచ్చే విధంగా చేస్తున్నారు. వైజాగ్ రాంకీ ఫార్మాసిటిలో కూడా అదే విధంగా నిర్వహిస్తున్నారు. వీటిన్నింటికి తోడు నాకు బాగా అద్భుతంగా కనిపిస్తోంది ఏమంటే ఫ్యూచరిస్టిక్ గా ఆర్టిఫిసియల్ ఇంటిలిజెన్స్ అనేది ప్రాముఖ్యమైంది. దానికి బేస్ అయిన రోబోటిక్ టెక్నాలజీ కి సంబంధించి ఇప్పటికే ట్రైనింగ్ స్టార్ట్ చేశారనేది చాలా సంతోషకరమైన విషయం.

రాష్ర్ట వ్యాప్తంగా 31 సెంటర్లలో జర్మన్ సంస్ధ సహకారంతో మౌళికసదుపాయాలు కల్పించి మంచి ఎక్విప్ మెంట్ తో 2,400 మందికి ఈ ఏడాది శిక్షణ కార్యక్రమం చేపట్టారనేది ముదావహం. వైయస్ జగన్ చేపట్టిన మంచి పధకాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఇది ఎంతో మేలైనది. మంచి భవిష్యత్తు ఉన్న అంశం ఇది. యువత దీనిని అందిపుచ్చుకోవాలి. ఈ కోర్సులో శిక్షణ పొందిన వారు జర్మనీకి వెళ్లి మంచి శాలరీలతో ఉపాధి పొందగలిగారన్నారు.

జస్ట్... బిటెక్ డిగ్రీ కాకుండా ఇలాంటి కోర్సులను వీలైనంతమంది అందిపుచ్చుకోవాలి. రోబో స్కిల్  ఇండస్ర్టీ ఇన్ వాల్వ్ అయి కాంపీటీషన్స్ పెట్టి వాటిలో విద్యార్దుల ప్రతిభకు మరింతగా మెరుగులు దిద్దేందుకు మూడు లక్షల రూపాయల మేర ప్రోత్సాహకాలు కూడా అందించడం అభినందించదగ్గ అంశం అన్నారు.

మన యువత అభివృధ్దికి తోడ్పడే ఇలాంటి ప్రోగ్రామ్స్ ను స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ మరిన్ని చేపట్టాలని కోరారు.ముఖ్యమంత్రి విజన్ కు తగినట్లుగా పరిశ్రమలకు అవసరమయ్యే వారిని తయారు చేసే దిశగా స్కిల్ డెవలప్ మెంట్ పనిచేయాలని సూచించారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నవరత్నాలా.. నవ గ్రహాలా?: సాకే శైలాజనాథ్