శీతాకాలంలో మృదువైన చర్మం కోసం...

Webdunia
శుక్రవారం, 28 డిశెంబరు 2018 (21:54 IST)
ముఖం అందంగా ఉండాలని రకరకాల క్రీంలు వాడుతుంటారు. అవి వాడటం వల్ల చర్మం పాడైపోతుంది. అలాకాకుండా ఎంతో సులభంగా తక్కువ ఖర్చుతో ఇంటి చిట్కాలు పాటించి అందమైన చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు. కొన్ని చిట్కాలతో మృదువైన చర్మం మీ సొంతం చేసుకోవచ్చు. అదెలాగో చూద్దాం.
 
1. మృదువైన చర్మం కోసం అరచెక్క నిమ్మరసాన్ని ఒక గుడ్డు తెల్లసొనలో కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకొని పది నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగివేయాలి. ఇలా వారానికి ఒకటి రెండుసార్లు చేయాలి.
 
2. ప్రతి రోజు కీరదోసకాయ ఫేస్ మాస్క్ వేసుకుంటే మెుటిమలు, బ్లాక్ హెడ్స్, ముడతలు, పొడిచర్మం వంటి సమస్యలు మీ దరిచేరవు. అదెలాగంటే... రెండు టేబుల్ స్పూన్ల ఓట్ మీల్ సగం ముక్క కీరదోసకాయ గుజ్జు, కొంచెం పాలు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ భాగాలకు రాసుకొని 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి.
 
3. కీరదోసకాయను క్లెన్సర్‌గా కూడా వాడవచ్చు. కీరదోసకాయ రసంలో కొన్ని పాలు కలిపితే క్లెన్సర్ అవుతుంది.
 
4. తేనెని గోరువెచ్చగా వేడిచేసి కళ్ల చుట్టూ వదిలి ముఖానికి రాస్తే ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో కడిగితే ముఖం మీద మచ్చలు, ముడతలు పోతాయి.
 
5. చర్మం పొడిగా ఉన్నవారు అర టీ స్పూన్ రోజ్ వాటర్‌లో ఒక టీ స్పూన్ తేనె కలిపి ముఖానికి రాయాలి. పదిహేను, ఇరవై నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా చేస్తే అందమైన చర్మం మీ సొంతం అవుతుంది.
 
6. బొప్పాయి రసాన్ని క్రమంతప్పకుండా ముఖానికి రాసుకుంటుంటే సూర్యకాంతి వల్ల చర్మంపై ఏర్పడ్డ గోధుమరంగు మచ్చలు తగ్గిపోతాయి. చర్మం మెరిసి పోవాలంటే బొప్పాయి గుజ్జులో కొంచెం నిమ్మరసం కలిపి వాడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

చంటి బిడ్డతో ట్రాఫిక్ క్లియర్ చేసిన మహిళా కానిస్టేబుల్.. సజ్జనార్, అనిత కితాబు (video)

నకిలీ మద్యం కేసు: జోగి సోదరులకు బెయిల్ మంజూరు.. కారణం?

ఈ ట్రంప్ ఏం చేస్తున్నారో ఎవరికీ అర్థం కావడంలేదు, కొత్త మ్యాప్ పెట్టాడు...

కాళేశ్వరం కేసులో కేసీఆర్, హరీష్ రావుకు ఊరట.. తెలంగాణ హైకోర్టు ఆదేశాలు

జెడ్పీటీసీ ఎన్నికలు.. సింహం గుర్తు కోసం కసరత్తు.. 20-30 స్థానాల్లో కవిత పార్టీ పోటీ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharva: మార్కెటింగ్ నా చేతుల్లో లేదు, ఇండియా గర్వపడే సినిమాగా బైకర్ :శర్వా

Soumith Rao: మ్యూజికల్ లవ్ డ్రామాగా నిలవే రాబోతుంది

VK Naresh: క్రేజీ కల్యాణం నుంచి పర్వతాలు పాత్రలో వీకే నరేష్

Megastar Chiranjeevi: మన శంకర వర ప్రసాద్ గారు విజయంపై చిరంజీవి ఎమోషనల్ మెసేజ్

ఈ రోజు మళ్లీ అదే నిజమని మీరు నిరూపించారు: మన శంకరవరప్రసాద్ గారు చిత్రంపై మెగాస్టార్

తర్వాతి కథనం
Show comments