Webdunia - Bharat's app for daily news and videos

Install App

శీతాకాలంలో సౌందర్య చిట్కాలు

Webdunia
సోమవారం, 10 జనవరి 2022 (23:25 IST)
చలికాలంలో చాలామందికి చర్మ సమస్యలు తలెత్తుతుంటాయి. చర్మం చిట్లినట్లు వుంటుంది. కొందరికి పెదవులు పగులుతుంటాయి. అలాంటివారు ఈ క్రింది చిట్కాలను పాటిస్తే ఫలితం వుంటుంది. రోజూ పడుకునే ముందు ముఖానికి బాదం నూనె కానీ, ఆలీవ్ ఆయిల్ కానీ రాయాలి. ఆయిల్ పెట్టే ముందు మురికి లేకుండా చర్మం శుభ్రంగా ఉండాలి. రోజూ పదినిమిషములు గోరువెచ్చని నీటిని దోసిట్లోకి తీసుకుని ముఖాన్ని మునిగేటట్లు ఉంచాలి. ఉదయం స్నానం చేయడానికి ముందు కానీ రాత్రి పడుకునే ముందు కానీ చేయవచ్చు.

 
ఒక కోడిగుడ్డు సొనలో ఒక టీస్పూన్ కమలారసం, ఒక టీ స్పూన్ ఆలివ్ ఆయిల్, నాలుగయిదు చుక్కల పన్నీరు అంతే మోతాదులో నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించి పదిపేను నిమిషముల తరువాత కడిగేయాలి. పొడి చర్మానికి మంచి ఫలితాన్ని ఇస్తుంది.

 
బాగా మగ్గిన అరటిపండును మెత్తగా చిదిమి ముఖానికి, మెడకు పట్టించి 15 నిమిషముల తరువాత గోరువెచ్చటి నీటితో కడగాలి. ఇది పొడి చర్మానికి మాయిశ్చరైజర్‌గా పని చేస్తుంది. మెడ నల్లగా ఉంటే క్రమంగా ఆ నలుపును కూడా వదిలిస్తుంది.

 
పొడి చర్మాన్ని మృదువుగా మార్చడంలో గ్రేప్ సీడ్ ఆయిల్ బాగా పని చేస్తుంది. దేనితో కలపాల్సిన అవసరం లేకుండా ఆయిల్ ను యధాతదంగా ఒంటికి రాసి మర్దనా చేస్తే సరిపోతుంది. ఈ ఆయిల్ ఇప్పుడు అన్ని సూపర్ మార్కెట్లలో దొరుకుతుంది.

సంబంధిత వార్తలు

వివేకా హత్య కేసులో రూ.40 కోట్లు చేతులు మారాయ్ : షర్మిల ఆరోపణ

చంద్రబాబు హామీలు కేవలం సైకిల్‌ బెల్స్‌ మాత్రమే..జగన్

మే 13, జూన్ 4 తేదీలకు వేతనంతో కూడిన సెలవులు

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారంటూ వైఎస్ షర్మిలపై కేసు నమోదు!!

కొణిదెల పవన్ కళ్యాణ్.. అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టాడు... తమ్ముడికి చిరంజీవి మద్దతు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

తర్వాతి కథనం
Show comments