Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గుంటూరు జిల్లా మాడుగులలో మహిళపై యాసిడ్ దాడి

Advertiesment
గుంటూరు జిల్లా మాడుగులలో మహిళపై యాసిడ్ దాడి
, శుక్రవారం, 7 జనవరి 2022 (10:45 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా గురజాల మండలంలో ఓ మహిళపై గుర్తు తెలియని దుండగుడు యాసిడ్‌దా దాడి చేశారు. దీంతో ఆ మహిళ తీవ్రంగా గాయపడింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
గురజాల మండలంలోని మాడుగుల గ్రామంలో శుక్రవారం ఉదయం గుర్తు తెలియని ఓ వ్యక్తి ఇంటి వద్దకు వచ్చాడు. దాహంగా ఉందని కాస్త మంచినీళ్లు ఇవ్వాలంటూ ఆ ఇంట్లో ఉన్న మహిళను ప్రాధేయపడ్డాడు. 
 
దీంతో  ఆ మహిళ జాలిపడి ఇంట్లోకి వెళ్లి మంచినీళ్లు తీసుకొచ్చి అతడికి ఇస్తుండగానే దుండగుడు తన వెంట తీసుకొచ్చిన యాసిడ్‌ను ఆమె శరీరంపై పోసి పారిపోయాడు. 
 
ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ మహిళను చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి బాధితురాలి వద్ద వివరాలు సేకరిస్తున్నారు. పారిపోయిన దండగుడి కోసం గాలిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హబుల్ అరుదైన ఘనత: 30 సంవత్సరాలు అంతరిక్షంలో.. 100 కోట్ల సెకన్లు పూర్తి