Webdunia - Bharat's app for daily news and videos

Install App

శీతాకాలంలో ఆరోగ్యవంతమైన చర్మం కోసం ఏం చేయాలి?

Webdunia
శుక్రవారం, 3 డిశెంబరు 2021 (23:25 IST)
శీతాకాలంలో చర్మం పొడిబారుతుంది. కొందరికి పగుళ్లు కూడా వస్తాయి. ఇలాంటి వారు చర్మ రక్షణకు విటమిన్ సి లేదా ఇ కలిగిన లోషన్‌లు రాసుకోవాలి. ఆయిలీ స్కిన్ వున్నవాళ్లు కొంచెం తేనె, పెరుగు, దోసకాయ, కమలాపండు రసం మిశ్రమం చేసుకుని ముఖానికి పట్టించుకుని అరగంట తర్వాత కడిగేయాలి. ఇలా చేస్తే ముఖం కాంతివంతంగా మారుతుంది.
 
పొడి చర్మం ఉన్నవారు అరటిపండు, తేనె, పాలు కలిపి రాసుకుంటే చర్మంలో మార్పు వస్తుంది. చర్మం పొడిబారినట్టుగా, ఉంటే పాలలో దూదిని ముంచి, ముఖమంతా రాసి, తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. రోజుకు రెండు మూడు సార్లు ఈ విధంగా చేయవచ్చు. దీని వల్ల చర్మం పొడిబారదు. మృతకణాలు తొలగిపోతాయి.
 
చర్మం పొడిబారి, తెల్లగా ఉంటే ఆలివ్ ఆయిల్‌ను వేడి చేసి రోజూ రాత్రి పడుకునే ముందు చర్మానికి పట్టించి మృదువుగా మర్దనా చేయాలి. టీ స్పూన్ వెన్నలో చిటికెడు పసుపు వేసి కలిపి, ముఖానికి చేతులకు పట్టించి పది నిమిషాలుండాలి. తర్వాత వెచ్చని నీటితో స్నానం చేస్తుంటే చర్మం మృదుత్వం కోల్పోదు. అరటిపండు గుజ్జు, తేనె కలిపి ముఖానికి పట్టించాలి. తర్వాత వేళ్లతో రెండు నిమిషాలు మర్ధనా చేస్తూ మెత్తటి కాటన్ టవల్‌తో ముఖమంతా అద్దాలి. చలికాలంలో రోజూ ఈ విధంగా చేస్తే చర్మం పొడిబారకుండా ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆర్ఆర్ఆర్‌ను చంపేందుకు స్కెచ్ .. ఆ పెద్దలు ఎవరో తెలాలి?: రాజేంద్ర ప్రసాద్ (Video)

ప్చ్.. నా పోస్టులు.. నా సినిమాలు ఒక్క ఓటరును ప్రభావితం చేయలేదు : ఆర్జీవీ (Video)

స్వయంగా కారు నడుపుతూ కనిపించిన కేసీఆర్.. బీఆర్ఎస్ వర్గాల్లో ఖుషీ (video)

తెలంగాణలో చలి: కొమరం భీమ్ జిల్లాలో వణికిపోతున్న జనం

భువనేశ్వర్‌: నాలుగేళ్ల బాలికను.. రూ.40వేలకు అమ్మేశారు.. ఎందుకంటే?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అక్కినేని ఫ్యామిలీలో వరుస వివాహ వేడుకలు... ముమ్మరంగా ఏర్పాట్లు!!

దివ్యప్రభ న్యూడ్ వీడియో... సోషల్ మీడియాలో వైరల్... పాపులారిటీ కోసమేనా (Video)

తుదిదశలో 'హరి హర వీర మల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్' షూటింగ్

శుభ్ మన్ గిల్‌తో ప్రగ్యా జైశ్వాల్ ప్రేమ.. నిజమెంత?

రాబిన్‌హుడ్ తో ఈ క్రిస్మస్ మాదే : హీరో నితిన్

తర్వాతి కథనం
Show comments