శీతాకాలంతో పాటు సీజనల్ వ్యాధులు కూడా వచ్చేస్తాయి. ముఖ్యంగా జలుబు. జలుబు చేస్తే, ఒకటి నుండి రెండు వారాల వరకు అనారోగ్యంతో ఉండవచ్చు. ఐతే ఆలోపు కొన్ని ఇంటి చిట్కాలు పాటిస్తే త్వరగా తగ్గిపోతుంది. తేనెతో గోరువెచ్చని నిమ్మకాయ రసంతో జలుబుకి అడ్డుకట్ట వేయవచ్చు.
ఆల్కహాల్, కాఫీ మరియు కెఫిన్ కలిగిన సోడాల జోలికెళ్లొద్దు. మీ శరీరానికి విశ్రాంతి అవసరం. గొంతు నొప్పిని ఉపశమనం చేయండి. ఉప్పు నీరు పుక్కిలించండి. చిన్నపిల్లల విషయంలో జాగ్రత్త అవసరం. తక్కువ వయస్సు ఉన్న పిల్లలు సరిగ్గా పుక్కిలించలేరు.
ముక్కు మరీ దిబ్బడగా వుంటే పెద్ద పిల్లలలో వైద్యుల సలహా మేరకు నాసల్ స్ప్రేలను ఉపయోగించవచ్చు. చికెన్ సూప్, టీ లేదా వెచ్చని జ్యూస్ వంటివి తీసుకుంటే జలుబు సమస్య తగ్గుతుంది.