ఈ ఐదింటితో మరింత అందంగా మారిపోవచ్చు...

సాధారణంగా మహిళలకు అందం అంటే చాలా ఇష్టం. దానికోసం మార్కెట్లలో దొరికే రకరకాల క్రీములను వాడుతుంటారు. ఇలా దీర్ఘ కాలంగా వాడటం వలన చర్మం త్వరగా పాడైపోతుంది.

Webdunia
శనివారం, 29 సెప్టెంబరు 2018 (21:13 IST)
సాధారణంగా మహిళలకు అందం అంటే చాలా ఇష్టం. దానికోసం మార్కెట్లలో దొరికే రకరకాల క్రీములను వాడుతుంటారు. ఇలా దీర్ఘ కాలంగా వాడటం వలన చర్మం త్వరగా పాడైపోతుంది. కనుక మనం ఇంట్లో సహజంగా లభించే పదార్ధాలతోనే ప్రకాశవంతమైన చర్మాన్ని పొందవచ్చు. అవి ఏమిటో తెలుసుకుందాం.
 
తేనె
తేనెలో మంచి యాంటీ-బ్యాక్టీరియా గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మం పైన ఉన్న మచ్చలకు, మెుటిమలకు మంచి ఔషధంగా పని చేస్తుంది. తేనె వలన చర్మం సున్నితంగా మారుతుంది.
 
దోసకాయ
ప్రకాశవంతమైన చర్మం కోసం చెప్పుకునే సౌందర్య చిట్కాలలో దోసకాయ చాలా మంచిది. ఫ్రిజ్ నుండి తీసిన దోసకాయ రసాన్ని కళ్లకు వాడటం వలన కంటికింద ఉన్న నల్లటి వలయాలు తొలగిపోయి కళ్లు ప్రకాశవంతంగా మెరుస్తూ ఉంటాయి. దీనిని చర్మానికి వాడటం వలన చర్మ సమస్యలు తగ్గిపోతాయి.
 
నూనెలు
ఆలివ్ ఆయిల్, బాదం వంటి నూనెలను వాడటం వలన ఇవి చర్మం పైన ఉన్న దుమ్ము, ధూళిలను పోగొడుతాయి. చర్మం కాంతివంతంగా
మెరిసేలా చేస్తుంది. 
 
టమోటా
టమోటా రసంతో ముఖం కడుక్కోవటం వలన ముఖంపై ఉన్న జిడ్డు తొలగిపోయి ముఖం తెల్లగా మెరుస్తూ ఉంటుంది. ఇది మంచి సౌందర్య లేపనంగా పనిచేస్తుంది.
 
పాలు
పాలలో కొద్దిగా శనగపిండి, చిటికెడు పసుపు కలిపి ముఖానికి పట్టించాలి. పది నిమిషాల తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రంగా కడుగుకోవాలి. ఇలా వారంలో రెండు రోజులు చేయడం వలన ముఖం తెల్లగా, తాజాగా, అందంగా తయారవుతుంది. ఈ పాలలో ఉన్న బ్యాక్టీరియాలు ముఖంపై ఉన్న జిడ్డును తొలగించి చర్మం ప్రకాశవంతంగా ఉండేలా చేస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వనపర్తి, గద్వాల, నారాయణపేట జిల్లాలను తొలగిస్తే ఊరుకునేది లేదు.. కేటీఆర్

కేసీఆర్ ఆధునిక శుక్రాచార్యుడు.. కేటీఆర్ మారీచుడు.. సీఎం రేవంత్ రెడ్డి

సంక్రాంతి సంబరాలు.. కోనసీమలో బోట్ రేసు పోటీలు.. పాల్గొంటున్న 22 జట్లు

AP Hikes Liquor Price: ఏపీలో లిక్కర్ ధరలు పెంపు

కదిలే కారులో సామూహిక అత్యాచారం.. ఒకరి తర్వాత ఒకరు..గంటల తరబడి..?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అమెరికాలో రాజా సాబ్ ఫట్.. మన శంకర వర ప్రసాద్ గారు హిట్.. అయినా ఫ్యాన్స్ అసంతృప్తి.. ఎందుకు?

Allu Aravind: బాస్ ఈజ్ బాస్ చించేశాడు అంటున్న అల్లు అరవింద్

Havish: నేను రెడీ ఫన్ ఫిల్డ్ టీజర్ రిలీజ్, సమ్మర్ లో థియేటర్లలో రిలీజ్

Malavika: స్టంట్స్ చేయడం అంటే చాలా ఇష్టం, మాళవికా మోహనన్

Sobhita : ఆకట్టుకుంటున్న శోభితా ధూళిపాళ క్రైమ్ థ్రిల్లర్ చీకటిలో ట్రైలర్

తర్వాతి కథనం
Show comments