పాలలో నానబెట్టిన ఖర్జూరాన్ని తీసుకుంటే.. కంటి చూపు..?
పాలు ఆరోగ్యానికి చాలా మంచివి. అలానే ఖర్జూరం అనారోగ్యానికి విరుగుడుగా పనిచేస్తుంది. ఈ రెండింటిని జతచేసి తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాం. పాలలో నానబెట్టిన ఖర్జూరాన్ని తీసుకుంటే శరీరానికి
పాలు ఆరోగ్యానికి చాలా మంచివి. అలానే ఖర్జూరం అనారోగ్యానికి విరుగుడుగా పనిచేస్తుంది. ఈ రెండింటిని జతచేసి తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాం. పాలలో నానబెట్టిన ఖర్జూరాన్ని తీసుకుంటే శరీరానికి కావలసిన శక్తి, పోషక విలువలు అందుతాయి.
రక్తహీనత సమస్యలు ఉన్నవారు క్రమం తప్పకుండా పాలలో ఖర్జూరాన్ని కాసేపు నానబెట్టి తీసుకుంటే తక్షణమై ఉపశమనం లభిస్తుంది. కొంతమంది ప్రతిరోజూ ఉదాయాన్నే వ్యాయామం చేస్తుంటారు. వారు తప్పకుండా పాలలో నానబెట్టిన ఖర్జూలను తీసుకోవాలి. దీంతో అలసట, ఒత్తిడి వంటి సమస్యలు దరిచేరవు.
కంటి చూపును మెరుగుపరచుటకు నానబెట్టిన ఖర్జూరాలు దివ్యౌషధంగా పనిచేస్తాయి. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. జ్ఞాపకశక్తిని పెంచుతాయి. వీటిని ఉదయాన్నే బ్రెక్‌ఫాస్ట్‌గా తీసుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది. ఈ నానబెట్టిన ఖర్జూరాలు తీసుకోవడం వలన శృంగార సామర్థ్యం పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.