Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాఫీలో ఆ శక్తి ఎక్కువగా వుందట..

కాఫీని రోజుకు రెండు కప్పులు తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చునని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. రోజూ కాఫీ తాగితే గుండె జబ్బులు వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతుంది. నిత్యం కాఫీ తాగితే టైప్ 2 డయాబెటిస

Webdunia
శనివారం, 29 సెప్టెంబరు 2018 (15:48 IST)
కాఫీని రోజుకు రెండు కప్పులు తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చునని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. రోజూ కాఫీ తాగితే గుండె జబ్బులు వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతుంది. నిత్యం కాఫీ తాగితే టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశాలూ తగ్గుతాయి. 
 
కాఫీలో ఉండే కెఫీన్ నాడీ వ్యవస్థను పటిష్టం చేస్తుంది. దీంతో రక్తంలో ఎపినెఫ్రిన్ స్థాయిలు పెరుగుతాయి. తద్వారా శారీరక దృఢత్వం లభిస్తుంది. యాక్టివ్‌గా ఉంటారు. ఎక్కువ సేపు పనిచేయగలుగుతారు. వయస్సు మీద పడడం కారణంగా చాలా మందికి అల్జీమర్స్ వ్యాధి వస్తుంది. అయితే రోజూ కాఫీ తాగితే ఈ వ్యాధి వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి. 
 
తాజాగా కాఫీలోని కెఫీన్‌కు నొప్పిని తట్టుకునే శక్తి వున్నట్లు తేలింది. తాజాగా అలబామా యూనివర్సిటీ నిర్వహించిన తాజా సర్వేలో.. కెఫీన్ వాడకాన్ని బట్టి నొప్పిని భరించే శక్తిలో హెచ్చుతగ్గులున్నట్లు పరిశోధకులు తేల్చారు. 19-77 ఏళ్ల వయస్సు మధ్య గల 62 మందిపై ఈ పరిశోధన జరిగింది.
 
ఇందులో కాఫీ తాగే వారిలో నొప్పిని భరించే శక్తి అధికంగా వున్నట్లు పరిశోధకులు గుర్తించారు. కాఫీతో పాటు ఆకుకూరలు వంటి మొక్కల నుంచి వచ్చే ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకునేవారిలోనూ నొప్పి భరించే శక్తి ఎక్కువగా ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన టీడీపీ కూటమి ప్రభుత్వం!

ఆపరేషన్ సిందూర‌తో పాకిస్థాన్ వైమానిక దళానికి అపార నష్టం!!

waterfalls: కొడుకును కాపాడిన తండ్రి.. జలపాతంలోనే మునక... ఎక్కడ?

కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులకు డెడ్ లైన్ లేదు.. పెళ్లి ఫోటో అక్కర్లేదు : మంత్రి నాదెండ్ల

విజయసాయి రెడ్డి ఓ చీటర్ : వైఎస్ జగన్మోహన్ రెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఘటికాచలం: నిర్మాత ఎస్ కేఎన్

కార్తిక్ రాజు హీరోగా అట్లాస్ సైకిల్ అత్తగారు పెట్లే చిత్రం ప్రారంభమైంది

మెగాస్టార్ చిరంజీవి 157 చిత్రం హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

తర్వాతి కథనం
Show comments