Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉల్లిపాయ, కలబంద గుజ్జుతో.. చుండ్రు..?

Webdunia
బుధవారం, 12 డిశెంబరు 2018 (11:22 IST)
చాలామంది తరచు చుండ్రు సమస్యతో బాధపడుతున్నారు. అందుకు ఎలాంటి పద్ధతులు పాటించినా ఫలితం లేదు. ఎక్కడికైనా బయటకు వెళ్లినప్పుడు ఈ సమస్య మరింతగా వేధిస్తుంది. చుండ్రు కారణంగా పదిమందిలో తిరగలేకపోతున్నానని ఆలోచన చెందుతారు. దీనిని ఎదుర్కొనేందుకు పరిష్కార మార్గాలివే.
 
1. బీట్‌రూట్‌ను పేస్ట్‌లా చేసుకుని అందులో పావుకప్పు ఉల్లిపాయ రసం కలిపి తలకు పట్టించాలి. అరగంట తరువాత తలస్నానం చేయాలి. ఇలా వారంలో రెండుసార్లు చేస్తే క్రమంగా చుండ్రు పోతుంది. 
 
2. నానబెట్టిన మెంతులను పేస్ట్ చేసి అందులో కొద్దిగా పెరుగు, నిమ్మరసం కలిపి జుట్టుకు పూతలా వేయాలి. దీంతో చుండ్రు పోతుంది. వెంట్రుకలు ఒత్తుగా పెరుగుతాయి. 
 
3. ఉల్లిపాయ రసంలో స్పూన్ తేనె కలిపి మిశ్రమంలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు రాసుకుని గంటపాటు అలానే ఉంచాలి. ఆపై గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. తద్వారా జుట్టు మృదువుగా మారుతుంది. చుండ్రు సమస్య ఉండదు. 
 
4. ఉల్లిపాయను కట్ చేసి పేస్ట్ చేసి తలకు రాయాలి. 30 నిమిషాల తరువాత తలస్నానం చేయాలి. ఇలా చేస్తే చుండ్రు తగ్గుతుంది. జుట్టు రాలకుండా ఉంటుంది. 
 
5. ఉల్లిపాయ రసంలో కొద్దిగా కలబంద గుజ్జు కలిపి మిశ్రమంగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు పూతలా రాయాలి. అరగంట ఆగాక తలస్నానం చేయాలి. ఇలా చేస్తే చుండ్రు రాదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పిల్లలకు భోజనం పెట్టే ముందు రుచి చూడండి.. అంతే సంగతులు: రేవంత్ వార్నింగ్

బంగాళాఖాతంలో అల్పపీడనం.. నెల్లూరు, తిరుపతి జిల్లాలకు రెడ్ అలెర్ట్

తెలంగాణ రాష్ట్రానికి శుభవార్త చెప్పిన కేంద్రం.. ఏంటది?

ట్రాఫిక్ పోలీస్ కూతురిని ఎత్తుకుని ముద్దాడిన బాలయ్య (video)

ఏపీఎస్ఆర్టీ ఏసీ బస్సుల్లో 20 శాతం రాయితీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'గేమ్ ఛేంజర్' నుంచి మరో లిరికల్ సాంగ్.. ఎలావుందంటే?(Video)

నాకోసం పోలీసులు వెతుకుతున్నారా? 26 పాయింట్లతో రాంగోపాల్ వర్మ భారీ ట్వీట్

మాలీవుడ్ ప్రేక్షకులకు ఇచ్చే అతిపెద్ద బహుమతి ఇదే : అల్లు అర్జున్

కోర్టు డ్రామా నేపథ్యంగా సాగే ఉద్వేగం మూవీ రివ్యూ

సమంత "రాణి"గా అభివర్ణించిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

తర్వాతి కథనం
Show comments