ఆ జైల్లో కత్తిలాంటి మహిళా ఖైదీలు శిక్షలను అనుభవిస్తున్నారు. వీరి మధ్య జైలు అధికారులు అందాల పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో వెరోనికా వెరోన్ అనే ఖైదీ.. ఈ సంవత్సరానికిగాను అందాలరాణి కిరీటాన్ని దక్కించుకుంది. ఈ పోటీలు బ్రెజిల్‌లని రియో డీజెనీరోలోని తలవెరా బ్రూస్ జైలులో జరిగాయి.
ఈ జైల్లో గత 13 యేళ్లుగా అందాల పోటీలు జరుగుతున్నాయి. వార్షికోత్సవాల పేరుతో ఈ అందాల పోటీలను నిర్వహిస్తుంటారు. ఈ పోటీల్లో అచ్చు బ్యూటీ పేజాంట్‌లో సందడి చేసినట్టుగానే మహిళా ఖైదీలు అలంకరించుకుని పాల్గొంటారు. మాజీ ఖైదీ సుందరి.. తాజాగా ఎన్నికైన ఖైదీ బ్యూటీకి క్రౌన్ తొడుగుతుంది.
మహిళా ఖైదీల హక్కులు కాపాడటం.. వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించడం.. వారి గౌరవాన్ని ఇనుమడింపజేయడం వంటి లక్ష్యాలతో ఇక్కడ జైల్లో ఇలాంటి పోటీలు ప్రతి యేటా నిర్వహిస్తుంటారు. 2018 సంవత్సరానికిగాను వెరోనికా వెరోన్ అనే ఖైదీకి 2017 సంవత్సరం విజేతగా మయానా రోసో ఆల్వ్స్‌లు కిరీటం తొడిగారు.