Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భార్య పక్కనే వున్నా.. యువతి డ్రెస్ బటన్స్ తీసి.. ప్రైవేట్ పార్ట్స్‌పై..?

ఓవైపు కట్టుకున్న భార్య.. మరోవైపు 22 ఏళ్ల యువతి. అంతే ఆ మృగాడు భార్య పక్కనున్న సంగతి మరిచిపోయాడు. అంతే నిద్రలోకి జారుకున్న యువతిపై కన్నేశాడు. డ్రెస్ బటన్‌ను తీశాడు. ప్రైవేట్ పార్ట్స్‌‍పై చెయ్యేశాడు. యు

Advertiesment
sexual assault
, మంగళవారం, 21 ఆగస్టు 2018 (18:12 IST)
ఓవైపు కట్టుకున్న భార్య.. మరోవైపు 22 ఏళ్ల యువతి. అంతే ఆ మృగాడు భార్య పక్కనున్న సంగతి మరిచిపోయాడు. అంతే నిద్రలోకి జారుకున్న యువతిపై కన్నేశాడు. డ్రెస్ బటన్‌ను తీశాడు. ప్రైవేట్ పార్ట్స్‌‍పై చెయ్యేశాడు. యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇదంతా విమానంలో ప్రయాణిస్తున్న వేళ జరిగింది. ఈ ఘటన డెట్రాయిట్‌లో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. భారత్‌కు చెందిన రమణమూర్తి అమెరికాలోని రోచెస్టర్‌ హిల్స్‌ సిటీలో ఉంటూ ఓ ఐటీ సంస్థలో మేనేజరుగా పనిచేసేవాడు. ఏడు నెలల క్రితం తన భార్యతో కలిసి లాస్‌వేగాస్‌లో డెట్రాయిట్‌ వెళ్లే స్పిరిట్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం ఎక్కాడు. తనకు ఓవైపు భార్య, మరోవైపు 22 ఏళ్ల యువతి కూర్చున్నారు. కాసేపటికి నిద్రలో జారుకున్న యువతిపై రమణమూర్తి లైంగిక చర్యలకు ఉపక్రమించాడు. 
 
ఏదో ఇబ్బందిగా వుందని యువతి లేచి చూసేసరికి తన డ్రస్ బటన్స్ విప్పి వున్నాయి. అంతేగాకుండా.. తన ప్రైవేట్ పార్ట్స్‌పై రమణమూర్తి చేతులు వుండటంతో.. ఒక్కసారిగా ఆ యువతి ఉలిక్కిపడింది. గాబరాగా సిబ్బందికి అతనిపై ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారంపై ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ అధికారులు విచారణ చేపట్టారు. 
 
ఆ సమయంలో తాను గాఢంగా నిద్రపోతున్నాననీ, తనకేం తెలియదంటూ రమణమూర్తి మొదట దబాయించాడు. లోతుగా ప్రశ్నించేసరికి... చేయకూడనిది చేసి ఉంటానని నేరం అంగీకరించాడు. సాక్ష్యాధారాలను పరిశీలించిన మిచిగాన్‌లోని డెట్రాయిట్‌ న్యాయస్థానం ఇటీవల అతడిని దోషిగా తేల్చింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేరళకు అరబ్ రూ.700కోట్ల భారీ ఆర్థిక సాయం.. మరోముప్పు..?