Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కేరళకు అరబ్ రూ.700కోట్ల భారీ ఆర్థిక సాయం.. మరోముప్పు..?

కేరళ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. కేరళ రాష్ట్రాన్ని వరద బాధితులను ఆదుకునేందుకు యావత్ భారత్ దేశం ముందుకు కదిలింది. కానీ కేవలం భారత దేశమే కాదు ఈ మహావిపత్తుపై చలించి ప్రపంచ దేశాలు కూడా

కేరళకు అరబ్ రూ.700కోట్ల భారీ ఆర్థిక సాయం.. మరోముప్పు..?
, మంగళవారం, 21 ఆగస్టు 2018 (16:24 IST)
కేరళ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. కేరళ రాష్ట్రాన్ని వరద బాధితులను ఆదుకునేందుకు యావత్ భారత్ దేశం ముందుకు కదిలింది. కానీ కేవలం భారత దేశమే కాదు ఈ మహావిపత్తుపై చలించి ప్రపంచ దేశాలు కూడా కేరళకు భారీ సాయం చేయడానికి ముందుకు వచ్చాయి. ఇప్పటికే గల్ప్ దేశాల్లో ఒకటైన ఖతార్ రూ.35 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. 
 
తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రూ.700 కోట్ల భారీ ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఈ విషయాన్ని కేరళ సీఎం పినరయి విజయన్ తెలిపారు. ఆర్థిక సాయం గురించి అబుదాబి ప్రిన్స్ ప్రధాని నరేంద్ర మోదీకి వివరించినట్లు విజయన్ చెప్పారు. కేరళవాసులకు మరో ముప్పు పొంచి ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వరద తాకిడి క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో నీటి నిల్వ ఉన్న ప్రదేశాల్లో అంటువ్యాధులు విజృంభించే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెప్తున్నారు.
 
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రుల్లో ఉన్న మందులు నీళ్లలో కొట్టుకుపోయిన నేపథ్యంలో అంటువ్యాధులు ప్రబలితే నిలువరించడం చాలా కష్టమవుతుందని.. అందుచేత కలుషిత ఆహరం, నీరు తీసుకోకుండా ఉండాలని సూచిస్తున్నారు. సరైన జాగ్రత్తలు తీసుకోకుంటే కలరా, డయేరియా, టైఫాయిడ్‌ వంటి వ్యాధులు ప్రబలే అవకాశముందని తద్వారా తీవ్ర నష్టం వాటిల్లుతుందని వైద్యులు చెప్తున్నారు. 
 
గతవారం రోజులుగా కేరళ ప్రజలు చికున్‌గన్యా, డెంగ్యూ, మలేరియా వ్యాధులతో బాధపడుతున్న కేరళ వాసులు.. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలని వైద్యులు చెప్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పరాయి పురుషుడుతో అసభ్య చాటింగ్.. భార్య బాగోతం చూసి నిశ్చేష్టుడైన భర్త...