Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కేరళకు ఆంధ్ర నుంచి రూ.56 కోట్లు... ఆదుకుందాం రండి... సీఎం చంద్రబాబు

అమరావతి : గడిచిన 24 గంటల్లో తూర్పు గోదావరి కూనవరంలో 275.2 మిమీ వర్షపాతం నమోదైందని సీఎం చంద్రబాబునాయుడు తెలిపారు. ధవళేశ్వరం 13,37,905 క్యూసెక్కుల నీరు గోదావరిలో ప్రవహిస్తోందన్నారు. 15 గ్రామాలు, 10మండలాలు., ఏలూరు, కొవ్వూరు, కుక్కునూరులలో 6వేల మందిని శ

Advertiesment
కేరళకు ఆంధ్ర నుంచి రూ.56 కోట్లు... ఆదుకుందాం రండి... సీఎం చంద్రబాబు
, సోమవారం, 20 ఆగస్టు 2018 (22:42 IST)
అమరావతి : గడిచిన 24 గంటల్లో తూర్పు గోదావరి కూనవరంలో 275.2 మిమీ వర్షపాతం నమోదైందని సీఎం చంద్రబాబునాయుడు తెలిపారు.  ధవళేశ్వరం 13,37,905 క్యూసెక్కుల నీరు గోదావరిలో ప్రవహిస్తోందన్నారు. 15 గ్రామాలు, 10మండలాలు., ఏలూరు, కొవ్వూరు, కుక్కునూరులలో 6వేల మందిని శిబిరాలకు తరలించామన్నారు. అమలాపురం., రంపచోడవరం., రాజమహేంద్ర వరంలలో 2వేల మందిని తరలించామన్నారు. గోదావరి., వంశధార., నాగావళి ప్రవాహాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. కొన్నిచోట్ల రాకపోకలు నిలిచిపోయాయన్నారు. ఎర్ర కాల్వకు జంగరెడ్డి గూడెంలో గండిపడిందన్నారు. వంతెన కూలిపోయిందని, దానిని రిస్టోర్ చేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. 
 
భద్రాచలం వద్ద జాతీయ రహదారి పాడైందని, దానిని బాగు చేస్తున్నామన్నారు. తూర్పు., పశ్చిమ., కృష్ణా., విశాఖలలో బాగా వర్షాలు పడ్డాయన్నారు. కంచికచర్ల., జగ్గయ్యపేట., పెనుగంచిప్రోలులో బాగా వర్షాలు పడ్డాయన్నారు. బుగ్గమంగమ్మ ఆలయం వద్ద చిక్కుకుపోయిన వారిని సురక్షితంగా కాపాడామన్నారు. అత్యవసర వస్తువులు., మందులు అందుబాటులో ఉంచామన్నారు. రిలీఫ్ కమిషనర్ స్వయంగా పనుల్ని పరిశీలిస్తున్నారన్నారు. నష్టం వివరాలు ఎప్పటికప్పుడు ఢిల్లీకి పంపుతున్నామన్నారు. 
 
నాలుగు జిల్లాల్లో ఎక్కువగా నష్టం ఉందన్నారు. ఏపీలో పడిన వర్షాలు., పైనుంచి పడిన వర్షాల వల్ల ఎక్కువగా నష్టం జరిగిందన్నారు. రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని బేరీజు వేసుకోవడంతో పాటు నష్టాన్ని తగ్గించడం., ఇబ్బందులు లేకుండా చేస్తున్నామన్నారు. రేపు కూడా వర్షాలు ఉంటాయన్నారు. ఎప్పటికప్పడు పరిస్థితిని సమీక్షిస్తున్నామన్నారు. కేరళలో జరిగిన నష్టంపై మానవతా దృక్పథంతో స్పందిస్తున్నామన్నారు. మే నుంచి 400 మందికి పైగా చనిపోయారన్నారు. 40 లక్షల ఎకరాల్లో నష్టం వాటిల్లిందన్నారు. ఏడు లక్షల 50వేల మంది వరద వల్ల ఇబ్బంది పడుతున్నారన్నారు. కేంద్రం కూడా బాగా స్పందించాలన్నారు.
 
కేరళను ఉదారంగా ఆదుకోవాలి...
అందరూ స్పందించి కేరళ ప్రజల్ని ఆదుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. త్వరలో కేరళకు ఓ ప్రతినిధి బృందాన్ని పంపి సంఘీభావం తెలియచేస్తామన్నారు. కేంద్రం 600 కోట్ల మాత్రమే ఇవ్వడం సరికాదన్నారు. దీనికి మించిన జాతీయ విపత్తు ఏమీ ఉండదన్నారు. ఒక రాష్ట్రంలో 80 శాతం అతలాకుతలం అయితే ఐదారు వందల కోట్ల విరాళం ప్రకటించి ఊరుకోవడం సరికాదన్నారు. అన్ని విధాలుగా అండగా ఉన్నామనే భావన కల్పించాల్సి బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. జాతీయ విపత్తుగా ప్రకటించాలన్నారు. అందరికంటే ఎక్కువ స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. 61,219 కోట్లు మాత్రమే 14వ ఆర్ధిక సంఘంలో పంచిపెట్టారన్నారు. 
 
ఇది సరిపోదని, కర్ణాటకను కూడా కేంద్రం ఉదారంగా ఆదుకోవాలని సీఎం చంద్రబాబు తెలిపారు. హుద్‌హుద్ వచ్చినపుడు వెయ్యి కోట్లు ప్రకటించి రూ.650 కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు. ఇది పద్ధతి కాదని, ఏ విధంగా ముందుకు పోవాలనే విషయంలో క్లారిటీ ఉండాలని అన్నారు. మొక్కుబడి సాయం సరికాదన్నారు. కేరళతో అంతా ఉన్నామనే భావన వారికి భరోసా ఇవ్వాలన్నారు. ఇప్పటికి 10 కోట్ల సాయం., 12 బోట్లు ., ఎన్డీఆర్ బృందాలను పంపామన్నారు. కేరళ సీఎంతో రెండుసార్లు మాట్లాడానని, బియ్యం కావాలని అడిగారని అన్నారు. రాష్ట్రంలో చాలామంది ఉదారంగా ముందుకు వచ్చి సాయం చేస్తున్నామన్నారు. ఐఏఎస్., ఐపిఎస్., ఐఎఫ్ఎస్‌లు ఉద్యోగులంతా కలిసి 24 కోట్ల రుపాయలు ఇవ్వడానికి ముందుకు వచ్చారన్నారు. 
 
ఏపీ జేఏసీ ఉద్యోగులు, పెన్షనర్ల తరపున 24 కోట్ల రుపాయల విరాళం, సచివాలయ ఉద్యోగులు 25 లక్షలు పోలీసులు అధికారుల సంఘం తరపున 7 కోట్లు. టీడీపీ పార్టీ ఎంపీలు ఒక నెల జీతం విరాళం, 21మంది ఎంపీల తరపున 2 కోట్లా పది లక్షలు ఎంపీ ల్యాడ్స్ నిధులు ఇవ్వనున్నారన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల తరపున రూ. 17లక్షల 16 వేలు, కేరళకు 2 వేల మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేస్తున్నామన్నారు. దాదాపు 6 కోట్ల రుపాయల విలువ చేసే బియ్యం ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపు 50 కోట్ల రుపాయల సాయం అందిస్తున్నామన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భర్త స్థానంలో నకిలీ... తెలంగాణ గృహిణిని రోడ్డున పడేశారు...