Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాఫీ పొడి రుచికే కాదు... కంటికి, కేశాలకు కూడా....

కాఫీలోని కెఫిన్ కంటికింద గల నల్ల వలయాలను తొలగించటంలో సహాయపడుతుంది. చర్మాన్ని టైట్ చేయటంలో సాయపడి, కంటిచుట్టూ వాచటాన్ని తగ్గిస్తుంది. కాఫీలో యాంటీ ఆక్సిడెంట్ చర్మాన్ని రక్షిస్తుంది. జుట్టు ఊడిపోవడం తగ్

Webdunia
సోమవారం, 28 మే 2018 (13:59 IST)
కాఫీలోని కెఫిన్ కంటికింద గల నల్ల వలయాలను తొలగించటంలో సహాయపడుతుంది. చర్మాన్ని టైట్ చేయటంలో సాయపడి, కంటిచుట్టూ వాపులను తగ్గిస్తుంది. కాఫీలో యాంటీ ఆక్సిడెంట్ చర్మాన్ని రక్షిస్తుంది. జుట్టు ఊడిపోవడం తగ్గించి కాంతివంతంగా, పొడవుగా పెరిగేలా చేస్తుంది. కాఫీ మీ చర్మాన్ని, జుట్టును మరింత ఆరోగ్యవంతంగా, శుభ్రంగా మారుస్తుంది. 

 
 
చెంచా కాఫీ పౌడర్‌ను తీసుకుని తాజా ఆలోవెరా జెల్‌తో కలుపుకోవాలి. తరువాత ఆ మిశ్రమాన్ని కళ్లకింది నల్లవలయాలపై రాసుకుని 15 నిమిషాల తరువాత చల్లటి నీటిలో కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కంటికింద నల్లవలయాలు తొలగిపోతాయి.
 
ఒక బౌల్‌లో కొంచెం కాఫీ పొడి, చెంచా తేనెను వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి సమానంగా పట్టించి నెమ్మదిగా మసాజ్ చేయాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీళ్ళతో కడిగేసుకోవాలి. ఇలా వారానికోసారి చేయడం వలన మెరుగైన వేగవంతమైన ఫలితాలను పొందవచ్చును.
 
కాఫీ జుట్టును పెరిగేలా చేయటమేకాకుండా, మృదువుగా మెరిసేలా చేస్తుంది. ఈ సింపుల్ కాఫీహెయిర్ మాస్క్ ఎలా తయారుచేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. చెంచా కాఫీ పౌడర్‌ను 2 చెంచాల ఆలివ్ నూనెతో కలిపి పేస్టులా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మీ జుట్టుకు పట్టించి గుండ్రంగా నెమ్మదిగా మసాజ్ చేయాలి. 15 లేదా 30 నిమిషాల తరువాత చల్లటి నీళ్ళతో స్నానంచేయాలి. దీన్ని వారానికొకసారి చేయడం వలన మెరుగైన ఫలితాలు పొందవచ్చును.
 
కొంచెం కాఫీని తయారుచేసి దాన్ని చల్లబరచి దానిని జుట్టకు రాసుకుని కాసేపాగాక జుట్టుకు షాంపూను, కండీషనర్ పట్టించి కడిగితే మీ జుట్టు మెరుస్తూ, మృదువుగా కనిపిస్తుంది. కెఫిన్ మీ చర్మం, జుట్టు రూపాన్ని మెరుగుపరచి వాటిని మరింత ఆరోగ్యవంతంగా మారుస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిపై గాడిద దాడి.. కాలికి తీవ్రగాయం వీడియో వైరల్

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం... ఆ రెండు పోర్టులకు ప్రమాద హెచ్చరికలు

పోర్టులోకి రైస్ ఎలా వస్తుంది? డిప్యూటీ సీఎం అయిన నాకే సహకారం లేదు: పవన్ విస్మయం (video)

వైనాట్ 175 అన్నారు.. చివరకు 11 వచ్చాయి.. అయినా మార్పు రాలేదు : జగన్‌పై బాలినేని ఫైర్

ఎల్లో మీడియా రాళ్లేస్తోంది.. 48 గంటలే టైమ్... జగన్ లుక్‌పై నెట్టింట చర్చ? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

తర్వాతి కథనం
Show comments