Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మేకప్ కాంట్రాక్ట్ పేరుతో బ్యూటీపార్లర్ యజమానికి కుచ్చుటోపీ పెట్టిన కి'లేడీ'లు

మేకప్ కాంట్రాక్టు ఇస్తామని చెప్పి... బ్యూటీపార్లర్ యజమానురాలికి ఇద్దరు కి'లేడీ'లు కుచ్చుటోపీ పెట్టారు. మేకప్ చేయమని చెప్పి... ఆమె వంటిపై ఉన్న బంగారు ఆభరణాలు, చెవిదుద్దులు, చేతి ఉంగరాలను దోచుకుని పారిప

Advertiesment
Hyderabad
, గురువారం, 24 మే 2018 (15:03 IST)
మేకప్ కాంట్రాక్టు ఇస్తామని చెప్పి... బ్యూటీపార్లర్ యజమానురాలికి ఇద్దరు కి'లేడీ'లు కుచ్చుటోపీ పెట్టారు. మేకప్ చేయమని చెప్పి... ఆమె వంటిపై ఉన్న బంగారు ఆభరణాలు, చెవిదుద్దులు, చేతి ఉంగరాలను దోచుకుని పారిపోయారు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో వెలుగు చూసింది. ఈ వివారలను పరిశీలిస్తే, 
 
జ్యోతి మంగేశ్వరి అనే మహిళ హైదరాబాద్, కేబీహెచ్‌బీ కాలనీలో బ్యూటీపార్లర్ నిర్వహిస్తోంది. ఈ పార్లర్‌కు ఇద్దరు మహిళలు మంగళవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో వచ్చారు. 
 
ఆ ఇద్దరు మహిళలు తమ ఇంట్లో పెళ్లి జరుగబోతుందని పెళ్లికూతురుకు మేకప్ కాంట్రాక్ట్‌ను ఇస్తామని మంగేశ్వరిని నమ్మించారు. పైగా, తమకు మేకప్ బాగా చేస్తేనే అది వచ్చేలా చూస్తామని చెప్పారు. 
 
అయితే, మేకప్ వేసే సమయంలో ఆభరణాలన్నీ తీసి పక్కనబెట్టాలని మంగేశ్వరికి ఓ నిబంధన పెట్టారు. వారి మాటలను నమ్మిన మంగేశ్వరి తాను ధరించిన బంగారపు నగలతో పాటు.. చెవి కమ్మలు, నాలుగు ఉంగరాలు, నాలుగు చేతి గాజులు తీసి అల్మారాలో పెట్టి భద్రపరిచింది. 
 
ఆ తర్వాత మంగేశ్వరిని మాయమాటలలో పడేసి ఆమెకు మౌత్ ఫ్రెషనరీ పేరిట మత్తు బిళ్లలను అందించారు. ఈ విషయం తెలియని మంగేశ్వరి ఆ బిళ్లలను చప్పరించడంతో ఆమె మత్తులోకి జారుకుంది. వెంటనే అల్మారాలో ఉన్న నగలను తీసుకుని అక్కడ నుంచి ఉడాయించారు. 
 
కొద్దిసేపటి తర్వాత మెళకువ వచ్చి చూడగా, అల్మారాలో నగలు కనిపించకపోవడంతో లబోదిబో మంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆ ఇద్దరు కిలేడీల కోసం గాలిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తూత్తుక్కుడి ఘటనపై పళనిసామి.. దాడి చేస్తుంటే పోలీసులు ఏం చేస్తారు..?