Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వేసవిలో చమటకాయలకు తులసి, తమలపాకుల మిశ్రమాన్ని తీసుకుంటే? ఎలా?

వేసవిలో చర్మం పాడవడానికి కారణం ఏమిటంటే డీ హైడ్రేషన్ అంటే చర్మం శరీరంలో నీటిని కోల్పోవడం. ఎప్పుడైతే చర్మం తేమని కోల్పోతుందో అప్పుడు చర్మం పొడి బారి పాడవుతుంది. అందుకోసం వాటర్ కలిసిన మాయిశ్చరైజింగ్ క్రీ

వేసవిలో చమటకాయలకు తులసి, తమలపాకుల మిశ్రమాన్ని తీసుకుంటే? ఎలా?
, సోమవారం, 21 మే 2018 (12:38 IST)
వేసవి వచ్చిందంటే అధికంగా చమడ పట్టడం, చర్మం పేలి ఇబ్బందికి గురిచేస్తుంది. ఈ సమస్యనుంచి బయటపడటానికి కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు.
 
వేసవిలో చర్మం పాడవడానికి కారణం ఏమిటంటే డీ హైడ్రేషన్ అంటే చర్మం శరీరంలో నీటిని కోల్పోవడం. ఎప్పుడైతే చర్మం తేమని కోల్పోతుందో అప్పుడు చర్మం పొడి బారి పాడవుతుంది. అందుకోసం వాటర్ కలిసిన మాయిశ్చరైజింగ్ క్రీమును రాసుకోవాలి. దానికంటే ముందుగా ముఖంపై రోజ్ వాటర్‌ను రాసుకుంటే మరింత మంచిది. 
 
వేసవిలో చర్మం ఎక్కువగా పొడిబారుతుంది అలాంటి సమయంలో ఎక్కువగా సబ్బుతో చాలా మంది కడుగుతూ ఉంటారు అలా చేయడం మంచి పద్దతి కాదు. దీనికి బదులుగా వీలైనన్ని సార్లు చల్లటి నీటితో ముఖం కడుక్కుంటే ఎంతో మంచిది. ఆకుకూరలు, కాయగూరలు అధికంగా వాడాలి. పండ్లు, మజ్జిగ, కొబ్బరి నీళ్ళు, పండ్లరసాలు వీటిన్నంటిని తీసుకుంటే మీ చర్మం మృదువుగా అందంగా కనిపిస్తుంది. అలాగే ఉదయం వేళల్లో ఇడ్లీ, ఉప్మా వంటి తేలిక పదార్థాలు తీసుకుంటే మంచిది.
 
మీ పేలిన చర్మానికి స్నానం చేసిన తరువాత మంచి గంధాన్ని అరగదీసి చేతులు, వీపు, మెడ, నడుముకు రాసుకోవాలి. అలాగే స్నానం చేసే ముందుగా తులసి ఆకులు, తమలపాకులు కలిపి దంచి ఆ మిశ్రమాన్ని ఒళ్ళంతా రుద్దుకొని ఓ గంట తర్వాత స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల చమట కాయల సమస్య నుంచి బయటపడవచ్చును.
 
వేసవిలో చేయవలసిన ముఖ్యమైన పని ఏమిటంటే మంచి నీళ్ళు ఎక్కువగా త్రాగడం అన్నింటికంటే ముందుగా చేయాల్సింది. మనం ఎప్పుడు త్రాగే నీటికంటే ఒక లీటరు నీటిని ఎక్కువగానే తీసుకోవాలి. వేసవి కాలంలో వేడిమి వలన శరీరం నుంచి చెమట రూపంలో నీరు ఎక్కువగా బయటకి వెళ్తుంది కాబట్టి శరీరంలో నీరు మంరింతగా ఉండటానికి ఎక్కువగా నీటిని తీసుకోవాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వేసవిలో కాలుష్యం వలన కలిగే వ్యాధులకు? ఎందుకు?