అందానికి 5 చిట్కాలు... ఏంటో చూడండి
అందం కోసం రకరకాల మేకప్‌లను వాడుతుంటారు. దీని వలన చర్మానికి హాని కలుగుతుంది. వీటిని దీర్ఘకాలంగా వాడటం వలన చర్మంపై మచ్చలు, ముడతలు ఏర్పడి త్వరగా ముఖం కాంతిహీనం అవుతుంది. కనుక మనం తినే ఆహారంలో మార్పు చేసుకోవటం వలన మన అందాన్ని మరింత మెరుగుపరచుకోవచ్చు. అదె
అందం కోసం రకరకాల మేకప్‌లను వాడుతుంటారు. దీని వలన చర్మానికి హాని కలుగుతుంది. వీటిని దీర్ఘకాలంగా వాడటం వలన చర్మంపై మచ్చలు, ముడతలు ఏర్పడి త్వరగా ముఖం కాంతిహీనం అవుతుంది. కనుక మనం తినే ఆహారంలో మార్పు చేసుకోవటం వలన మన అందాన్ని మరింత మెరుగుపరచుకోవచ్చు. అదెలాగో చూద్దాం.
1. పాలకూరలో విటమిన్ ఎ, బెటాకెరోటిన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి వృద్ధాప్య ఛాయలు రాకుండా చేస్తాయి. చర్మాన్ని కాపాడతాయి. దీనివలన చర్మం మెరుస్తూ కనిపిస్తుంది.
2. టమోటాలలో లైకోపిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది చర్మానికి మంచి మెరుపును అందిస్తుంది.
3. క్యారెట్‌ను ప్రతిరోజు ఆహారంలో తీసుకోవటం వల్ల ముఖానికి మంచి నిగారింపు వస్తుంది. ఇది ఎండ కిరణాల ప్రభావం నుండి చర్మాన్ని కాపాడుతుంది.
4. పెరుగులో ఉండే లాక్టిక్ ఆమ్లాలు చర్మానికి తేమను అందించి రకరకాల చర్మ సమస్యలను దూరం చేస్తుంది.
5. నిమ్మలో సి విటమిన్ పుష్కలంగా ఉండటం వలన దీనిలో ఉన్న యాంటీఏజింగ్ గుణాలు పిహెచ్ లెవల్‌ను పెంచుతాయి. జిడ్డు చర్మం ఉన్నవాళ్లు నిమ్మరసాన్ని ముఖానికి రాసుకోవటం వలన మంచి ఫలితం ఉంటుంది.