Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెరుగు, తేనెతో ఫేస్‌ప్యాక్...?

Webdunia
శుక్రవారం, 1 ఫిబ్రవరి 2019 (11:07 IST)
చలికాలం కారణంగా చర్మం పొడిబారి ముడతలుగా మారుతుంది. చర్మ తత్వాన్నే మార్చేస్తుంది. దాంతో ఏం చేయాలో తెలియక బయట దొరికే క్రీములు, ఫేస్‌ప్యాక్స్ వాడుతుంటారు. ఈ బయట పదార్థాలు కొందరికి సెట్ ‌అవుతుంది. మరికొందరికి సెట్ కావు. అలాంటివారి కోసం ఈ చిన్నపాటి చిట్కాలు...
 
రోజ్‌వాటర్ ఫేస్‌ప్యాక్:
రోజ్‌వాటర్‌లోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చర్మాన్ని కాంతివంతంగా మార్చేలా చేస్తాయి. 2 స్పూన్ల్ రోజ్‌వాటర్‌కి స్పూన్ గంధం చేర్చి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు రాసుకోవాలి. అరగంటపాటు అలానే ఉంచి ఆ తరువాత చల్లని నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే ముఖంపై గల నల్లటి మచ్చలు పోతాయి. రోజ్‌వాటర్ లేని పక్షంలో గులాబీ రేకులను కూడా వాడొచ్చు.
 
పెరుగు ఫేస్‌ప్యాక్:
పెరుగు చర్మానికి మాయిశ్చరైజ్‌గా పనిచేస్తుంది. పావుకప్పు పెరుగు తీసుకుని అందులో 1 స్పూన్ తేనె కలిపి పేస్ట్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు అప్లై చేసుకోవాలి. ఆ తరువాత 20 నిమిషాలాగి చల్లని నీటితో కడిగేయాలి. ఇలా ప్రతిరోజూ కాకపోయినా వారంలో రెండుమూడు సార్లు క్రమంగా చేస్తే ముఖచర్మం పొడిబారకుండా ఉంటుంది. 
 
నిమ్మరసం ఫేస్‌ప్యాక్:
నిమ్మరసం ఆరోగ్యానికే కాదు అందానికి ఎంతో దోహదపడుతుంది. ఎలాగంటే.. 2 స్పూన్ల నిమ్మరసంలో కొద్దిగా శెనగపిండి, పెరుగు కలిపి పేస్ట్ చేసి ముఖానికి అప్లై చేయాలి. ఈ ప్యాక్‌ను అరగంటపాటు అలానే ఉంచాలి. ఆపై గోరువెచ్చని నీటితో శుభ్రం కడిగేయాలి. ఇలా చేయడం వలన చర్మంపై గల మృతుకణాలు తొలగిపోతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

శబరిమలలో అయ్యప్ప భక్తుడు ఆత్మహత్య.. అక్కడ నుంచి దూకేశాడు.. (video)

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి మూడు రోజుల పాటు వర్షాలు...

జనసేనలో చేరికపై ఇపుడేం మాట్లాడలేను : మంచు మనోజ్ (Video)

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

లైలా చిత్రంలో అమ్మాయి పాత్రలో విశ్వక్సేన్ !

తర్వాతి కథనం
Show comments