Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొబ్బరి పాలలో తేనె కలిపి.. ఇలా చేస్తే..?

Webdunia
గురువారం, 4 ఏప్రియల్ 2019 (15:01 IST)
ఎండ వలన నల్లగా మారి కమిలిన చర్మానికి కొబ్బరి, కొబ్బరి నీళ్లు ఎంతో మేలు చేస్తాయి. కుదుళ్లను బలంగా మార్చడంలో కొబ్బరి పాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. జుట్టు పొడిబారి ఎండు గడ్డిలా కనిపిస్తున్నప్పుడు.. కప్పు కొబ్బరి పాలలో నాలుగు చెంచాల తేనె, ఒకటి లేదా రెండు కోడిగుడ్ల తెల్ల సొన చేర్చి బాగా కలిపి తలంతా పట్టించాలి. అరగంటయ్యాక తలస్నానం చేస్తే జుట్టు పట్టుకుచ్చులా తయారవుతుంది.
 
అప్పటికప్పుడు చర్మానికి మెరుపు రావాలంటే.. కొబ్బరి పాలల్లో దూదిని ముంచి ముఖమంతా మృదువుగా మర్దన చేసి కాసేపయ్యాక కడిగేసుకోవాలి. ఇలా వారంలో రెండుసార్లు క్రమంగా చేస్తే ఫలితం ఉంటుంది. శరీరం కోమలంగా తయారై.. ప్రకాశవంతంగా కనిపించాలంటే.. స్నానానికి అరగంట ముందు.. కొబ్బరిపాలతో బాగా మర్దన చేసుకుని సోయాపిండిలో కొద్దిగా బత్తాయిరసం కలిపి నలుగులా పెట్టుకోవాలి. 
 
బయటినుంచి వచ్చాక 5 నిమిషాలు విశ్రాంతి తీసుకుని కొబ్బరి నీటితో ముఖం కడుక్కుంటే.. ఎండ వలన నల్లగా మారిన చర్మం తాజాదనాన్ని పొందుతుంది. కొబ్బరినీటిలో దూదిని ముంచి రాసుకున్నా తేడా కనిపిస్తుంది. కొబ్బరి నీటిలో కొద్దిగా నిమ్మరసం కలిపి ముఖానికి అప్లై చేసుకోవాలి. గంటపాటు అలానే ఉంచి ఆ తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా తరచు చేస్తుంటే.. ముఖంపై గల నల్లటి మచ్చలు, మొటిమలు పోతాయి. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments