వేసవికాలంలో కూల్‌డ్రింక్స్ తాగుతున్నారా?.. జాగ్రత్త.. లేకుంటే..?

Webdunia
గురువారం, 4 ఏప్రియల్ 2019 (14:56 IST)
వేసవి కాలం వచ్చింది కదా.. కాస్త చల్లదనంగా కోసం మార్కెట్‌లో లభించే కూల్‌డ్రింక్స్‌ను ఇష్టంగా తాగేస్తున్నారా? అయితే జాగ్రత్త..కాస్త ఆలోచించండి. ఇలా చేయడం వల్ల మనం అనారోగ్యాన్ని కోరి తెచ్చుకున్నవాళ్లం అవుతాం. సాధారణంగా కూల్‌డ్రింక్స్ అనేవి కాలంతో సంబంధం లేకుండా లభిస్తాయి.


మనలో చాలా మంది వాటిని ఎంతో ఇష్టంగా తాగుతుంటారు. ఎండాకాలంలో అయితే దాహం మరీ ఎక్కువగా ఉండడం వల్ల కూల్‌డ్రింక్‌లను తాగుతారు. వీటి వల్ల దాహం తీరుతుంది కానీ ఎన్నో ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ముఖ్యంగా శరీర బరువు అమాంతం పెరిగిపోతుంది.
 
కూల్‌డ్రింక్స్‌లో కేలరీలు, అలాగే చక్కెర శాతం ఎక్కువగా ఉంటాయి. దీని వల్ల షుగర్, ఊబకాయం, గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదముంది. బరువు తగ్గాలనుకునే వాళ్లు కూల్‌డ్రింక్స్‌కి దూరంగా ఉండడం చాలా మంచిది. కూల్‌డ్రింక్స్‌లో సోడా శాతం అధికంగా ఉంటుంది. ఫలితంగా తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణమై మళ్లీ మళ్లీ ఆకలేస్తుంది. ఎక్కువ ఆహారం తింటారు. దీంతో బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
 
కూల్‌డ్రింక్స్‌లో కలిపే కెమికల్స్ శరీరానికి హాని కలిగిస్తాయి. వీటిని ప్రూవ్ చేయడానికి చాలామంది కూల్‌డ్రింక్స్‌తో ఇంట్లోని సింక్స్ శుభ్రం చేయడం వంటి వీడియోలను యూట్యూబ్‌లో పోస్ట్ చేస్తున్నారు. అంటే వీటిని యాసిడ్‌కి బదులుగా వాడుతున్నారన్న మాట.

ఈ శీతలపానీయాలు చల్లగా ఉంటూనే నోట్లోకి వెళ్లి విషంగా మారి ప్రాణాలను హరిస్తున్నాయని ఇప్పటికైనా గ్రహించండి. కూల్‌డ్రింక్స్ తాగాలనుకున్నప్పుడు వాటికి బదులుగా నీటిని తాగండి లేదా ఫ్రూట్ జ్యూస్ తాగండి. ఇలా చేయడం వల్ల మీకు అనారోగ్యం దూరమై ఆరోగ్యవంతులుగా మారతారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కారు సైడ్ మిర్రర్‌కు బైక్ తాకిందని కారుతో గుద్ది చంపేసిన కపుల్ (video)

గుజరాత్‌లో బాలికపై సామూహిక అత్యాచారం.. పొలాల్లోకి లాక్కెళ్లి ..?

వరదలో చిక్కుకున్న 15 మందిని కాపాడిన రెస్క్యూ బృందానికి సీఎం చంద్రబాబు ప్రశంసలు

మొంథా తుఫాను.. రవాణాకు తీవ్ర అంతరాయాలు.. ముగ్గురు కొట్టుకుపోయారు... ఒకరినే?

మొంథా తుఫాను- తెలంగాణలో భారీ వర్షాలు- పెరుగుతున్న రిజర్వాయర్ మట్టాలు- హై అలర్ట్‌

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సైబర్ క్రైమ్ పోలీసులను మళ్లీ ఆశ్రయించిన చిరంజీవి

Rajamouli : బాహుబలి ఎపిక్ తో రాజమౌళి అందరికీ మరో బాట వేస్తున్నారా !

Peddi: రామ్ చరణ్, జాన్వీ పై కేరళ లోని రైల్వే టనల్ దగ్గర పెద్ది షూటింగ్

సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న సూపర్ స్టార్ రజనీకాంత్?

China Peace : స్పై డ్రామా చైనా పీస్ నుంచి ఇదేంటో జేమ్స్ బాండ్ సాంగ్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments