Webdunia - Bharat's app for daily news and videos

Install App

కీరదోస గుజ్జుతో ఇలా చేస్తే..?

Webdunia
గురువారం, 3 జనవరి 2019 (12:14 IST)
ముఖం ఎంత అందంగా కనిపించినా.. ముఖంపై మొటిమలు వస్తే మాత్రం చూసేందుకు అంద విహీనంగానే ఉంటుంది. ఈ సమస్య ప్రతి ఒక్కరూ ఎదుర్కునేదే. మొటిమలు తొలగించుకోవడానికి.. రకరకాల క్రీములు వాడుతుంటారు. అయినను మొటిమలు పోలేదని బాధపడుతుంటారు. మరి కింద తెలిపిన చిట్కాలు పాటిస్తే మొటిమలను తగ్గించుకోవచ్చని చెప్తున్నారు.. మరి అవేంటో చూద్దాం..
 
1. 2 స్పూన్ల్ శెనగపిండిలో స్పూన్ పెరుగు కలిపి పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా రెండు రోజుల కోసారి చేస్తే మొటిమ సమస్యను తగ్గించవచ్చును.
 
2. పుదీనా ఆకులను మెత్తగా రుబ్బుకుని దాని నుండి రసాన్ని తియాలి. ఈ రసాన్ని ముఖానికి రాసుకోవాలి. రాత్రంత అలానే ఉంచి ఉదయాన్నే శుభ్రం చేసుకోవాలి. ఇలా వారం రోజులపాటు చేస్తే ముఖం కాంతివంతంగా మారుతుంది.
 
3. దాల్చిన చెక్కను పొడి చేసుకుని అందులో కొద్దిగా నీరు, నిమ్మరసం వేసి కలిపి పేస్ట్ చేసి ముఖానికి అప్లై చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే.. మొటిమలు తగ్గడమే కాకుండా ముఖం తాజాగా మారుతుంది.
 
4. కీరదోసను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పేస్ట్ చేయాలి. ఈ గుజ్జును ముఖానికి పూతలా వేసుకోవాలి. అరగంట పాటు అలానే ఉంచి ఆపై శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచు చేయడం వలన ముఖంపై గల మొటిమలు పోతాయి.
 
5. స్పూన్ బియ్యం, గసగసాలు, బాదం గింజలను తీసుకుని మెత్తగా నూరుకోవాలి. ఈ మిశ్రమానంలో 2 స్పూన్ల పెరుగు కలిపి పేస్ట్ చేయాలి. ఆపై ముఖానికి రాసుకోవాలి. గంట తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే ముఖంపై గల మచ్చలు పోతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

100 మంది అమ్మాయిల్లో నలుగురే పవిత్రులు: ప్రేమానంద్ వివాదాస్పద వ్యాఖ్యలు

ఏపీకి అనుకూలంగా విధానాలను అనుసరిస్తున్న కాంగ్రెస్ సర్కార్: కేసీఆర్ ఫైర్

Prakash Raj: బెట్టింగ్ యాప్‌ కేసు.. ఈడీ ముందు హాజరైన ప్రకాష్ రాజ్

మణికొండలో దారుణం : వాటర్ ట్యాంకు ఢీకొని టెక్కీ దుర్మరణం

ఒక్కో బిడ్డను కంటే నగదు బహుమతి... చైనా సరికొత్త ప్రణాళిక

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రిసార్టులో హంగామా సృష్టించిన సినీ నటి కల్పిక

Payal Rajput: పాయల్ రాజ్‌పుత్ ఇంట తీవ్ర‌ విషాదం-ఆమె తండ్రి క‌న్నుమూత‌

'ఆర్ఎక్స్-100' హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కు పితృవియోగం

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

తర్వాతి కథనం
Show comments