హైదరాబాద్‌‌లో మరో దారుణం: కులాంతర వివాహం చేసుకున్న యువకుడిని నడి బజారులో నరికి చంపేశారు

Webdunia
శనివారం, 21 మే 2022 (12:10 IST)
నాగరాజు ఘటన మర్చిపోకముందే హైదరాబాద్‌లో మరో యువకుడి హత్య కలకలం రేపింది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. అత్యంత రద్దీగా ఉండే బేగంబజార్ ప్రాంతంలో జనం తిరుగుతోన్న సమయంలోనే ఒక యువకుడిని ఇరవైసార్లు పొడిచి చంపారు.

 
మార్వాడీ కులానికి చెందిన నీరజ్ కుమార్ పన్వర్, యాదవ కులానికి చెందిన సంజనలు ఏడాదిన్నర క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి ఆర్యసమాజ్‌లో జరిగింది. వీరికి నెలల వయసున్న బాబు ఉన్నాడు. అబ్బాయిపై కోపం పెంచుకున్న సంజన కుటుంబ సభ్యులు ఈ హత్య చేసినట్టు పోలీసుల ప్రాథమిక అంచనా.

 
నీరజ్ కుమార్ స్థానికంగా వ్యాపారం చేస్తున్నాడు. నీరజ్, సంజనలు పెళ్లి చేసుకున్నపుడు.. నీరజ్ తనకు ప్రాణ హాని ఉందని అఫ్జల్‌గంజ్ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చాడు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం, శుక్రవారం రాత్రి ఏడున్నర ప్రాంతంలో హత్య జరిగింది. నీరజ్ రోడ్డు దాటుతుండగా ముందుగా గ్రానైట్ రాయితో మోదారు. తరువాత కొబ్బరి బొండాల కత్తితో పొడిచారు. అతని హత్యకు చాలాకాలం నుంచి ప్రణాళిక వేస్తూ, కొంతకాలంగా అతని రాకపోకలు గమనిస్తూ ఉన్నారు.

 
ఘటన సమాచారం అందుకున్న షాయినాయత్ గంజ్ పోలీస్ స్టేషన్ సిబ్బంది బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ హత్య బేగంబజార్‌లో కలకలం రేపింది. స్థానిక వ్యాపారులు అర్ధరాత్రి పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చి ఆందోళన చేశారు. శనివారం బేగంబజార్ బంద్‌కి పిలుపునిచ్చారు. ఘటనపై బాధితుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనలో ఇప్పటి వరకూ పది మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలి : నిర్మాత సి.కళ్యాణ్

నా సినిమాలు రీచ్ కాలేదు, త్వరలో డైరెక్షన్ చేస్తా : రాజ్ తరుణ్

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కిల్లర్ సర్ ప్రైజ్ చేస్తుంది - డైరెక్టర్ పూర్వజ్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యలకు, వారణాసి టైటిల్ పైన రాజమౌళికు చుక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments